BigTV English

Kitchen garden : కొత్త టెక్నాలజీతో కిచెన్ గార్డెన్..

Kitchen garden : కొత్త టెక్నాలజీతో కిచెన్ గార్డెన్..
Kitchen garden

Kitchen garden : వ్యవసాయం అనేది కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రమే చేస్తాయి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత మనిషి పని చాలా సులువు అయిపోయింది. అందుకే ఎంతోమంది ఈ రంగంపై ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఓ అరబ్ దేశం కూడా దీనికి దృష్టిపెట్టింది.


సౌదీ అరేబియా ఇతర ప్రపంచ దేశాలతో పోటీపడాలని ఉత్సాహం చూపిస్తోంది. ఎకానమీని పెంపొందించుకోవాలని, జీవనవిధానాన్ని పెంపొందించాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇన్నోవేషన్ విషయంలో, పెట్టుబడుల విషయంలో సౌదీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో కొత్త కొత్త ఐడియాలతో స్టార్టప్‌లు ఏర్పరుచుకోవడానికి సౌదీ ఎన్నో అవకాశాలు అందిస్తోంది. కొత్త ఇన్నోవేటింగ్ ఐడియా ఎవరి దగ్గర ఉన్నా సరే.. వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళుతోంది.

సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇన్నోవేటివ్ ఐడియాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ఎన్నో మార్పులకు మూలం.. ఈ యూనివర్సిటీ నుండి పుట్టిందే. ఎన్నో స్టార్టప్ కంపెనీలను లాభాలవైపుగా కూడా నడిపిస్తోంది ఈ యూనివర్సిటీ. ఇక ఈ యూనివర్సిటీకి సంబంధించిన నటూఫియా ల్యాబ్స్ అనేది దేశంలో ఆహార భద్రతను పెంపొందించడానికి కష్టపడుతోంది.


2014లో ఈ సంస్థ హైడ్రోపోనిక్ కిచెన్ ఫార్మ్ అనే ఐడియాతో ముందుకొచ్చింది. ఇది మొక్కలు ఆరోగ్యంగా పెరిగే విధంగా ఒక కంటెయినర్‌ను తయారు చేసింది. నటూఫియా స్మార్ట్ గార్డెన్ పేరుతో ఇప్పటికీ ఈ ఐడియా మొక్కలను పెంచే విధానంలో ఫేమస్‌గా ఉంది. అయితే ఈ టెక్నాలజీ ద్వారా మొక్కల పెంపకం విషయంలో వాతావరణంతో ఆధారపడాల్సిన పని ఉండదు. సీజన్ ఏదైనా.. వాతావరణం ఎలా ఉన్నా.. ఈ టెక్నాలజీ మొక్కలను ఆరోగ్యంగా పెంచగలుగుతుంది.

ఈ స్మార్ట్ కిచెన్ గార్డెన్‌లో సీడ్ పాడ్స్‌ను క్యాబినేట్‌లో పెట్టవలసి ఉంటుంది. 10 రోజుల తర్వాత ఆ పాడ్.. ఒక అందమైన మొక్కగా మారుతుంది. ఆ తర్వాత ఆ మొక్క మరింత పెరగడానికి దానిని ఛాంబర్‌లోకి మార్చాల్సి ఉంటుంది. 30 రోజుల్లో ఏ ఎరువులు అవసరం లేకుండా ఆ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా 40 రకాల మొక్కలను పెంచవచ్చు. ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ.. కిచెన్ గార్డెన్ ఐడియాను ఫేమస్ చేసేసింది సౌదీ అరేబియా.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×