Rashmika Mandanna: అభిమాన హీరో, హీరోయిన్లను చూస్తే చాలనుకునేవారు బోలెడంత మంది. అలాంటిది అభిమాన స్టార్లు క్షణం ఆగి, తమ గురించి పట్టించుకుంటే ఇక ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పాలా? అస్సలు చెప్పలేం అంటున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్.
రీసెంట్‌గా వారిసు సినిమా వేడుక చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రష్మిక మందన్న. వెన్యూ నుంచి ఆమె వెళ్తూ ఉండగా, కొందరు అభిమానులు బైక్ మీద ఫాలో అయ్యారు. కాసేపటికి ఆ విషయాన్ని గమనించిన రష్మిక కారు ఆపి, విండోస్ దించి వారితో మాట్లాడారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవడంలేదు. ఫస్ట్ హెల్మెట్ పెట్టుకోండి. సేఫ్టీ ఫస్ట్
అని మందలించారు.
తమ క్షేమం గురించి రష్మిక అంత గట్టిగా మాట్లాడటంతో సరే మేడమ్ అలాగే మేడమ్ అంటూ చిన్నపిల్లల్లా తలూపారు ఫ్యాన్స్. వారి రెస్పాన్స్ చూసి రష్మికకు నవ్వు ఆగలేదు.
సాటి మనిషి ఎదురైతే మహా అంటే నవ్వుతాం. లేకుంటే చిన్నగా పలకరిస్తాం… అందులో పోయేదేముంది? అని అంటారు రష్మిక. రీసెంట్‌గా ఎయిర్‌పోర్టులో పేపరాజీలను కూడా అలాగే పలకరించారు. మీరు అసలు నిద్రపోరా? ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఎలా? నేను ఫుల్లుగా నిద్రపోయి లేచి వచ్చా. అయినా ఇంకా నిద్రసరిపోలేదు
అంటూ సరదాగా మాట్లాడారు. పేపరాజీలు అడిగినన్ని ఫోజులు కూడా ఇచ్చారు. ఎక్కడైనా సరే, కొరియన్ స్టైల్‌లో లవ్ సింబల్స్ చూపిస్తూ, ఫొటోగ్రాఫర్లు అడిగినట్టు ఫోజులిస్తూ, ఫ్రెండ్లీ గర్ల్ అనిపించుకుంటున్నారు రష్మిక. 2022లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి 2023 జనవరిలో బ్యాక్ టు బ్యాక్ రెండు రిలీజులున్నాయి. అందులో ఒకటి కోలీవుడ్‌లో ప్రూవ్ చేసుకోవాల్సిన వారిసు, మరొకటి బాలీవుడ్‌లో బౌన్స్ బ్యాక్ కావాల్సిన మిషన్ మజ్ను అన్నమాట.