BigTV English
Advertisement

Lakshmi Parvathi: జూ. ఎన్టీఆర్‌ అంటే బాలయ్యకు ఎప్పట్నుంచో కోపం.. అందుకే కాల్పులు జరిపాడు.. లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్..!

Lakshmi Parvathi: జూ. ఎన్టీఆర్‌ అంటే బాలయ్యకు ఎప్పట్నుంచో కోపం.. అందుకే కాల్పులు జరిపాడు.. లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్..!

Lakshmi Parvathi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వంటి హీరోలు టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అయితే బాలయ్య బాబుతో సరిచూస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఎనలేని అభిమానులు ఉన్నారు. ఒక్క దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు సెల్యూట్ చేసినవారెందరో ఉన్నారు. అయితే నందమూరి నటసార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వీరు తమ సినిమాలతో ప్రత్యేకంగా నిలుస్తున్నా.. వ్యక్తిగతంగా మాత్రం చాలా దూరంగా కోపతాపాలతో ఉంటున్నారు.


ముఖ్యంగా బాలయ్య బాబుకు, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అస్సలు పడటం లేదని చెప్పాలి. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అందులో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సంఘటన ఒకటి. జనవరి 18న నందమూరి తారక రామారావు వర్థంతి. ఆ సందర్భంగా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు వెళ్లిపోయిన తర్వాత బాలయ్యబాబు అక్కడకు వచ్చి నివాళులర్పించారు. ఆ సమయంలో బాలయ్య బాబు చేసిన పనికి తీవ్ర దుమారం రేగింది.

ఎప్పట్నుంచో బాలయ్యకు ఎన్టీఆర్‌కు పడటం లేదని చిన్న చిన్న గాసిప్స్ వినిపించేవి. అయితే ఆ రోజుతో అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తారక రామారావు వర్థంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలయ్య బాబు అక్కడే ఉన్న ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలిగించాలని తెలిపాడు. దీంతో అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు బాలయ్యపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మాజీ భార్య లక్ష్మీ పార్వతి సైతం బాలయ్యపై ఫైర్ అయింది. ఇందులో భాగంగానే ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.


Also Read: ఒలింపిక్స్ లో అత్తమ్మ పచ్చళ్ళు.. ఏమన్నా ప్లానా సురేఖమ్మ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణకు ఉన్న కోపం ఇప్పటిది కాదని.. గత కొన్నేళ్ల నుంచి ఉందని చెప్పుకొచ్చింది. తనను కుటుంబం నుంచి బయటకు పంపించినట్లే జూనియర్ ఎన్టీఆర్‌ను పంపించేశారని తెలిపింది. బాలకృష్ణకు అహంకారం ఎక్కువ.. ఎన్టీఆర్‌పై ఆయనకున్న ఆక్రోషం గతం నుంచే ఉందని పేర్కొంది. అయితే అందుకు కారణాన్ని కూడా తెలిపింది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు జూనియర్ ఎన్టీఆర్‌కే దక్కుతున్నాయి. అది తెలిసి జీర్ణించుకోలేకే బాలకృష్ణ అలా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది.

అది మాత్రమే కాకుండా అప్పట్లో బాలయ్య కాల్పులపై కూడా ఆమె స్పందించారు. అప్పట్లో బెల్లంకొండ సురేష్‌పై గన్‌తో కాల్చడానికి కూడా ఒకరకంగా ఎన్టీఆర్ సినిమానే కారణమని తెలిపింది. ఎందుకంటే అప్పట్లో బాలకృష్ణ నటించిన సినిమాను థియేటర్ల నుంచి తీసేసి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా ప్రదర్శించడంతో బాలయ్య గొడవలు చేసి కాల్పులు జరిపాడని పేర్కొంది. అలా ఆ నాడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న కోపంతోనే బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపాడని లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×