E-Paper
Advertisement

Latest Movies : పెద్ద సౌండ్ చేస్తున్న చిన్న సినిమాలు

Latest Movies : పెద్ద సౌండ్ చేస్తున్న చిన్న సినిమాలు
Advertisement

Latest Movies : వరుసగా నాలుగు సినిమాలు. అన్నీ చిన్న సినిమాలే. ఒక్క మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్-పవిత్ర లోకేష్ తప్ప నోటెడ్ యాక్టర్స్ ఎవరూ లేరు. అలాగని సింపుల్‌గా ఏం రిలీజ్ అవలేదు. గట్టి సౌండ్‌తోనే రిలీజ్ అయ్యాయి. అందులోనూ ఈ నాలుగు సినిమాలకు ఒక్కో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. మళ్లీ పెళ్లి సినిమా నరేష్ నిజ జీవిత కథ కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. పబ్లిసిటీ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. పైగా ఈ సినిమా తనను అవమానించేలా ఉందంటూ నరేష్ వైఫ్ కోర్టుకెళ్లారు. సో, పబ్లిసిటీ మరింత పెరిగింది.

Advertisement

ఇక మేం ఫేమస్ సినిమా ట్రెండింగ్‌లోకి వెళ్లింది. మహేశ్ బాబు ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. యూట్యూబ్ స్టార్ స్వయంగా డైరెక్ట్ చేసి హీరోగా నటించిన సినిమాపై… విడుదలకు ముందు నుంచే ప్రశంసలు దక్కాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో మేం ఫేమస్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. పైగా విజయ్ దేవరకొండ, అడివి శేష్, నాగ చైతన్య ప్రమోషన్ ఇచ్చారు. ఈ
సినిమా తెలంగాణ యాసతో రావడం మరో ప్లస్ పాయింట్.

ఇక మీటూ తరహాలో మెన్‌టూ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆడవాళ్ల వల్ల మగవాళ్లు ఎన్నెన్ని కష్టాలు పడతారో తీశారు. మగాళ్లను ఆడవాళ్లు ఎంత టార్చర్ పెడతారో చూపించారు. అయితే, ఈ సినిమా కంటెంట్ రెండు వైపుల ఉంటుందని, ఆడవారిని కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుందని సినిమా యూనిట్ ముందుగానే చెప్పింది.

Advertisement

ఇక కేరళలో సూపర్ డూపర్ హిట్ అయిన 2018 సినిమా కూడా గట్టి ప్రమోషన్స్‌తో థియేటర్లలోకి వచ్చింది. ఆల్రడీ సక్సెస్ అయిన సినిమా కాబట్టి.. సినిమా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇదే 2018 సినిమాకు పెద్ద పాజిటివ్ బజ్. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×