BigTV English

Sleep Apnea: స్లీప్ అప్నియాను కనిపెట్టే పరికరం.. ఇంట్లోనే పరీక్షలు..

Sleep Apnea: స్లీప్ అప్నియాను కనిపెట్టే పరికరం.. ఇంట్లోనే పరీక్షలు..

Sleep Apnea: ఏ ఆరోగ్య సమస్యకు అయినా నిద్రే పరిష్కారం అని చాలామంది అంటుంటారు. రాత్రంతా హాయిగా నిద్రపోతే.. ఎన్నో సమస్యలు దూరమయిపోతాయని చాలామంది అభిప్రాయం. కానీ ఆ నిద్ర విషయంలో కూడా ఈరోజుల్లో చాలామంది అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. నిద్రలేమి మాత్రమే కాకుండా నిద్రకు సంబంధించి మరెన్నో సమస్యలు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. అందులో ఒకటి స్లీప్ అప్నియా.


అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో సైతం స్లీప్ అప్నియా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజాగా స్టడీల్లో తేలింది. కానీ స్లీప్ అప్నియా గురించి కనుక్కోవాలన్నా, దాని గురించి టెస్టులు చేయించుకోవాలన్నా.. అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలామందికి స్లీప్ అప్నియా ఉందేమో అన్న అనుమానం ఉన్నా.. టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. అందుకే జార్జియా శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో ఈ వ్యాధి గురించి కనుక్కునే మార్గాన్ని కనిపెట్టారు.

స్లీప్ అప్నియా అంటే నిద్రలో శరీరానికి సరిగ్గా శ్వాస అందకపోవడం. నిద్రలో శ్వాస తీసుకోవడానికి కలిగే ఇబ్బందినే స్లీప్ అప్నియా అంటారు. ఈ వ్యాధి ఉన్నవారు సరిపడా సమయం నిద్రపోయినా కూడా అలసిపోయినట్టుగానే ఫీల్ అవుతుంటారు. అందుకే జార్జియా శాస్త్రవేత్తలు స్లీప్ అప్నియాను కనిపెట్టడం కోసం ఒక ధరించగలిగే పరికరాన్ని కనిపెట్టారు. మామూలుగా నిద్ర సమస్యలు ఉన్నవారు లేదా స్లీప్ అప్నియా ఉందని భావించేవారు దీని గురించి కనుక్కోవాలంటే ఆసుపత్రిలో ఒక రాత్రి మొత్తం అబ్జర్వేషన్‌లో ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ కొత్త పరికరం ద్వారా ఇంట్లోనే స్లీప్ అప్నియా టెస్ట్ జరుపుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఈ పరికరం అనేది నిద్రలో మనిషి యొక్క ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఇది మనిషి నుదుటిపై పెట్టుకునే విధంగా ఉంటుంది. దాంతో పాటు చెంపపై ఒక చిన్న అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. చాలామందికి స్లీప్ అప్నియా అనేది ఉన్నా కూడా దానిని కనిపెట్టడం కష్టం కాబట్టి బయటపడడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకు దీనిని కనిపెట్టడానికి ఒక స్మార్ట్‌ఫోన్ యాప్ కూడా తయారు చేయబడలేదని అన్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారు చేసిన ఈ పరికరం స్లీప్ అప్నియాను కనిపెడుతుందని వారు హామీ ఇస్తున్నారు. త్వరలోనే ఇది అమెరికాలో మార్కెట్లలో అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×