BigTV English

Training For Robots : రోబోలకు కొత్త రకమైన ట్రైనింగ్.. దానికోసమే..

Training For Robots : రోబోలకు కొత్త రకమైన ట్రైనింగ్.. దానికోసమే..

Training For Robots : సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన ఎన్నో విషయాలు మనుషుల రోజూవారీ జీవితాల్లో భాగమయిపోయాయి. అలాంటి వాటిలో రోబోలు కూడా ఒకటి. రోబోలు అనేవి ప్రస్తుతం చాలావరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మనుషులతో స్నేహం కూడా చేసేస్తున్నాయి. ఇండియా లాంటి దేశాల్లో మెడికల్, ఫుడ్, టెక్స్‌టైల్.. ఇలా రంగాల్లో రోబోలు మనుషులకు సాయం చేస్తున్నాయి. అందుకే రోబోలకు ఒక కొత్త విషయాన్ని నేర్పించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


రోబో చేతులు అనేవి దేనినైనా గట్టిగా పట్టుకుంటాయి. గత కొన్నేళ్లలో అడ్వాన్స్ టెక్నాలజీతో తయారైన రోబోటిక్ హ్యాండ్స్ అనేవి మనిషి చేతులు చేయగలిగే అన్ని పనులను చకచకా చేసేస్తున్నాయి. ఒక కాఫీని అందించమంటే అందిస్తుంది. అదే కాఫీని తయారు చేయమంటే రోబో దేనిని కింద పడేయకుండా చేయగలదా అంటే అవును అని శాస్త్రవేత్తలు సైతం కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏ తప్పు లేకుండా ఫ్ల్యూయిడ్‌తో పనిచేసే విషయంలో రోబోలు ఇంకా పూర్తిగా ట్రెయిన్ అవ్వలేదని వారు బయటపెట్టారు.

ఫ్ల్యూయిడ్స్ అనేవి లిక్విడ్ రూపంలో ఉంటాయి. వాటిని ఒలికిపోకుండా పట్టుకోవాలి అనే విషయంతో రోబోలకు చాలావరకు ట్రెయిన్ చేయలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా ఆ లిక్విడ్ ఫార్మాట్‌ను రోబోలు అర్థం చేసుకోవాలి. ఆపై వాటితో ఎలా డీల్ చేయాలి అనే విషయంలో రోబోలకు ట్రైనింగ్ ఇవ్వాలి అని తెలిపారు. దానికోసమే ఒక ప్రైవేట్ సంస్థ సిద్ధమయ్యింది. సాలిడ్స్, లిక్విడ్స్ లాంటివాటిని వేర్వేరుగా విభజించి, వాటి విషయంలో విడివిడిగా రోబోలకు ట్రైనింగ్ ఇస్తామని ముందుకొస్తోంది.


ఇప్పటివరకు రోబోలకు లిక్విడ్స్ విషయంలో ట్రైనింగ్ ఇవ్వకపోవడానికి ఖర్చు కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అలాంటి మెథడ్స్‌లో వాటికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అని అన్నారు. అందుకే ప్రస్తుతం ఈ ప్రైవేట్ సంస్థ.. ఇతర శాస్త్రవేత్తలతో కలిసి దీనిని సాధ్యం చేయనుంది. ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేయడానికి సిద్ధపడ్డారు. ఎన్నో విషయాల్లో మనిషికి సాయంగా, ఒక్కొక్కసారి మనిషిని దాటేసే విధంగా అభివృద్ధి చెందిన రోబోటిక్స్ రంగం ఈ కొత్త విద్యతో మరింత ముందుకు వెళ్లనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×