BigTV English

Lavanya : రాజ్ తరుణ్‌కు క్షమాపణలు.. తన కాళ్లు పట్టుకుంటా: లావణ్య

Lavanya : రాజ్ తరుణ్‌కు క్షమాపణలు.. తన కాళ్లు పట్టుకుంటా: లావణ్య

Lavanya : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ లావణ్య గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా మానసికంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా ముందు తన గోడును వెళ్ళబోసుకుంది. ఆ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అయితే ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కానీ ఇప్పుడు మరో వార్తతో వార్తల్లో నిలిచింది. ఇటీవల లావణ్య, మస్తాయిన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మస్తాన్ సాయిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసు విచారణలో పోలీసులకు ఎన్నో నమ్మలేని విషయాలు బయపడుతున్నాయి. దీంతో పోలీసులు ఇంకాస్త డెప్త్ గా ఈ కేసును స్టడీ చేస్తున్నారు. అయితే, రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది.


రాజ్ తరుణ్ కు లావణ్య క్షమాపణలు..

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తాజాగా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్బంగా ఆమె మరోసారి సంచలన విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ కు క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు. రాజ్ తరుణ్ ఒక్కడే ఉంటే అతని కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగేదాన్నని ఆమె తెలిపారు. ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదని లావణ్య అన్నారు. నా జీవితం నాశనం కావడానికి మస్తాన్ సాయి అతని కుటుంబం కారణం అని లావణ్య వెల్లడించారు..


Also Read : మెగా ఫ్యాన్స్ అప్‌సెట్… ‘కింగ్ డమ్‌’ను రిజెక్ట్ చేసి తప్పు చేశాడా..?

మస్తాన్ సాయి పై షాకింగ్ కామెంట్స్.. 

మస్తాన్ సాయి తప్పు చేశాడు అని చెప్పిన నేను ఎంతగా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అందరు అతడికే సపోర్ట్ చేశారు అని లావణ్య పేర్కొన్నారు. రాజ్ తరుణ్ తో నేను చాలా సంతోషంగా ఉండేదాన్నని లావణ్య తెలిపారు. మస్తాన్ సాయి వచ్చినప్పటి నుంచి మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ఆమె వెల్లడించారు. మాస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. ఎలా అయినా మాస్తాన్ సాయి ని పోలీసులకు పట్టించాలని ఇదంతా చేశాను.. మాస్తాన్ సాయి వలన రాజ్ తరుణ్ దూరం అయ్యాడు. మాస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే.. నన్ను కూడా ఆ కేసులో ఇరికించారు. కానీ నాకు ఆ కేసుతో సంబంధం లేదు..అతని దగ్గర 800 నగ్న వీడియో లు పైనే ఉన్నాయి.. అందులో నా వీడియోలు కూడా ఉన్నాయి. నేను జైలు నుండి బయటకు రాగానే రాజ్ తరుణ్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ చాలా మంచి వాడు. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు, మాస్తాన్ సాయి వలనే రాజ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మస్తాన్ సాయి గురించి వీడియోలతో సహా బయట పెట్టడంతో నాకు ప్రాణ హాని ఉంది. గుంటూరు లో కేసు పెట్టిన సమయంలో నాపై 20 మంది మాస్తాన్ సాయి అనుచరులు దాడులు చేశారు. మాస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం బహిరంగంగానే మాస్తాన్ భార్య, ప్రియురాలు నగ్న వీడియోలు మాత్రమే ఉన్నాయి అని చెపుతున్నారు. అతని పక్కా ప్లాన్ తోనే ఉన్నాడు. అతని దగ్గర రాజ్ తరుణ్, నాది పర్సనల్ వీడియోలు ఉన్నాయని లావణ్య అన్నారు. నేను ఎప్పుడు అతనితో లేను.. వీడియో కాల్ ఉన్నాను తప్ప, పోలీస్ ఆఫీసర్స్ తో నేను మాట్లాడలేదు. మాస్తాన్ సాయి వేధింపుల తట్టుకోలేకనే 4 అమ్మాయిలు విదేశాలకు వెళ్లిపోయారు. మొత్తానికి ఆమె మరోసారి మస్తాన్ సాయి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం లావణ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై రాజ్ తరుణ్ ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×