E-Paper
Advertisement

Raj Tarun- Lavanya: ముదురుతున్న రాజ్ తరుణ్ వివాదం.. అతన్ని చెప్పుతో కొట్టిన లావణ్య.. ?

Raj Tarun- Lavanya: ముదురుతున్న రాజ్ తరుణ్ వివాదం.. అతన్ని చెప్పుతో కొట్టిన లావణ్య.. ?
Advertisement

Raj Tarun- Lavanya: హీరో రాజ్ తరుణ్ – లావణ్యల వివాదం రోజురోజుకు ముదురుతోంది. నిన్నటికి నిన్న రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కు వస్తే అక్కడకు లావణ్య వచ్చి రచ్చ రచ్చ చేసింది. ఆ తరువాత అతని ఇంటికి వెళ్లి.. రాజ్ తరుణ్ కావాలి అని హంగామా చేసింది. అయినా రాజ్ తరుణ్ ఆమెను కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఇలా ఎప్పుడు రాజ్ తరుణ్ బయటకు వచ్చినా .. లావణ్య కూడా అతడు ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి రచ్చ చేయడం జరుగుతుంది. లావణ్య చేసేవన్నీ ఆరోపణలు అని, ఆమె దగ్గర ఆధారాలు లేవని రాజ్ తరుణ్ చెప్పుకొస్తున్నాడు. పెళ్లి చేసుకొని, అప్పుడే పిల్లలు వద్దనుకుని తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడని లావణ్య అంటుంది. ఇలా వీరిద్దరి మధ్య జరుగుతున్న వివాదంలోకి మూడో వ్యక్తి శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ఆర్జేగా చెప్పబడే శేఖర్.. తనకు తాను.. రాజ్ తరుణ్ స్నేహితుడుని అని పరిచయం చేసుకొని.. లావణ్య, రాజ్ తరుణ్ ను వేధిస్తోందని, అతడి ఇంటి కోసమే ఇదంతా చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యల విన్న లావణ్య.. శేఖర్ కు కాల్ చేసి కూడా మాట్లాడింది. ఆ ఆడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. తప్పతాగి.. బూతులు మాట్లాడిన ఆడియో గురించి శేఖర్ నిలదీయగా.. రాజ్ తరుణ్ తన సేఫ్టీ కోసం తనకు తెలియకుండా ఆడియోలు రికార్డ్ చేసి, నాన్ని దోషిగా నిలబెట్టడానికి లీక్ చేసాడని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఆ కాల్ లోనే ఫేస్ టూ ఫేస్ కూర్చొని మాట్లాడుకోవడానికి వస్తారా అని లావణ్య అడగ్గా .. ఎక్కడికైనా వస్తాను అని శేఖర్ చెప్పాడు. ఇక దీంతో వీరికి ఒక ఛానెల్.. లైవ్ షో ఏర్పాటు చేసినట్లు సమాచారం. అక్కడ వీరిమధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకోవడంతో లావణ్య.. శేఖర్ ను చెప్పుతో కొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆవేశంతో ఊగిపోయిన శేఖర్ కూడా ఆమెపై దాడికి యత్నించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇందులో నిజమేంటి అనేది శేఖర్ నోరు విప్పితే తప్ప తెలియదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×