BigTV English

Paris Olympics: ఒలింపిక్స్ బరిలోకి ఏడు నెలల గర్భిణి.. నాడా హఫీజ్ అద్భుతమే!

Paris Olympics: ఒలింపిక్స్ బరిలోకి ఏడు నెలల గర్భిణి.. నాడా హఫీజ్ అద్భుతమే!

As 7-month pregnant Egyptian fencer in Paris Olympics: ఒలింపిక్స్..ప్రతీ నాలుగేళ్లకోసారి జరుగుతుంటాయి. అయితే ఈ వేదికలో అడుగు పెట్టాలని ప్రతీ క్రీడాకారుడు కలలు కంటాడు. అయితే ఎప్పటికైనా ఈ వేదికపై విశేష ప్రతిభను కనబరిచి దేశానికి గర్వపడేలా పేరు తీసుకొచ్చేందుకు శ్రమిస్తుంటాడు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి ఆటగాడు ఎంత ఫిట్ ఉన్నాడో తెలుసుకునేందుకు పరీక్షిస్తుంది. ఇందులో కొంచెం గాయపడిన టోర్నీకి దూరం కావాల్సిందే. అయితే ఈ పోటీల్లో ఓ ఏడు నెలల గర్భిణి బరిలో దిగి పోటీపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


అట్టహాసంగా జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ బరిలో ఏడు నెలల గర్భిణి ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ పోటీకి దిగడమే కాకుండా విజయాన్ని కూడా అందుకుంది. అయితే ఈ విషయం ఆమె స్వయంగా చెప్పే వరకు ఎవరికీ తెలియదు. ఆమె సోషల్ మీడియా వేదికగా తాను ఏడు నెలల గర్భిణి అంటూ పోస్ట్ చేసింది.

‘పోడియంపై ఇద్దరు ప్లేయర్స్ పోటీ పడతారు. అయితే ఈసారి మాత్రం ముగ్గురు పోటీ పడ్డారు. నేను, నా పోటీదారుడితోపాటు ఇంకా ప్రపంచంలోకి అడుగుపెట్టని నా చిన్న పాప. నాతోపాటు నా లిటిల్ బేబీ కూడా ఫిజికల్ గా, ఎమోషనల్ గా ఫేస్ చేసింది.’ అంటూ పోస్ట్ లో పేర్కొంది.


అంతేకాకుండా, నా వ్యక్తిగత జీవితంతోపాటు క్రీడా జీవితంలో బ్యాలెన్స్ చేసేందుకు పోరాటం చేశానని, పతకం గెలవకపోయినా ఈ ప్రయాణం విలువైందన్నారు. మొదటి మ్యాచ్ లో గెలిచిన నేను..తర్వాత 16వ రౌండ్ లో నా స్థానాన్ని కాపాడుకునేందుకు గర్వంగా ఫీలవుతున్నానని చెప్పడానికే ఈ పోస్టు చేశానని ఆమె పేర్కొంది.

Also Read: క్యాజువల్‌గా షూట్ చేసి ఒలింపిక్ మెడల్ కొట్టాడు.. టర్కీ షూటర్ వైరల్

ఇదిలా ఉండగా, క్రీడల్లో గర్భిణి పొల్గొనడం ఇది కొత్తేమీ కాదని, 2107లో సెరెనా విలియమ్స్ గర్భిణిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే 2014లో అల్సియా మోంటావా యూఎస్ఏ గర్భిణిగా ఉండి 800మీటర్టల రేసులో పాల్గొన్నారు.

Related News

UAE Vs IND : UAE పై టీమిండియా భారీ విక్టరీ.. నాలుగు ఓవర్ల లోనే మ్యాచ్ ఫినిష్

IND Vs UAE : కుల్దీప్ అరాచ‌కం..ఒకే ఓవ‌ర్ లో 3 వికెట్లు…కుప్ప‌కూలిన యూఏఈ

Boycott IND vs PAK : టీమిండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌…కార‌ణం ఇదే

IND vs UAE, Asia Cup 2025: టాస్ గెలిచిన టీమిండియా…ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే

IND vs PAK: టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు బిగ్ షాక్‌..చూసేవాడే క‌రువ‌య్యాడు.. ఒక్క టికెట్ కూడా సేల్ కాలేదు..!

T20 World Cup 2026 : 2026 టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే… ఫైనల్ అక్కడే… పాకిస్తాన్ లేకుండానే!

Big Stories

×