BigTV English

Turkey Shooter: క్యాజువల్‌గా షూట్ చేసి ఒలింపిక్ మెడల్ కొట్టాడు.. టర్కీ షూటర్ వైరల్

Turkey Shooter: క్యాజువల్‌గా షూట్ చేసి ఒలింపిక్ మెడల్ కొట్టాడు.. టర్కీ షూటర్ వైరల్

Paris Olympic 2024: పారిస్ ఒలింపిక్ గేమ్స్‌లో ఈ రోజు టర్కీ షూటర్ ప్రపంచ దేశాల ప్రజల దృష్టిని ఆకర్షించాడు. పారిస్ ఒలింపిక్స్ అంటే వరల్డ్ ఫేమస్. అన్ని దేశాలు ఈ అంతర్జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇక క్రీడాకారుల గురించి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనాలని సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమించేవారు కోకొల్లలు ఉంటారు. ఇక అందులో పాల్గొనడమే కాకుండా.. పతకం సాధిస్తే ఆ మజాయే వేరు. ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అధునాతన పరికరాలు ఉపయోగించుకుంటారు.


గత ఒలింపిక్ క్రీడల్లో భారత దేశం తరఫున పాల్గొన్న మను బాకర్ పిస్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకుని కాంస్య పతకాన్ని సాధించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా సరిచూసుకుంటారు. కానీ, టర్కీ దేశానికి చెందిన షూటర్ యూసుఫ్ డికెక్‌కు మాత్రం ఇవేవీ పట్టనట్టు ఉన్నది. పోటీలో పాల్గొనడానికి చాలా క్యాజువల్‌గా వచ్చాడు. అదేదో ఇంటి నుంచి షాప్‌కు వెళ్లినట్టుగా సింపుల్ టీ షర్ట్ ధరించి వచ్చాడు. ఎలాంటి గేర్ లేకుండానే తుపాకి చేతబట్టుకున్నాడు. సాధారణంగా షూటర్స్ బయటి శబ్దాలు వినబడకుండా చెవులకు ఎక్విప్‌మెంట్ పెట్టుకుంటారు. మరొకన్ను డిస్ట్రాక్ట్ కాకుండా ఒక కన్ను మూసి ఉంచే ఏర్పాటు చేసుకుంటారు. ఇక గురి చూసే కన్ను కోసం కూడా ప్రత్యేకంగా లెన్స్ పెట్టుకుంటారు. ఈ డికెక్ ఇవేవీ పెట్టుకోలేదు.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన: మంత్రి పొంగులేటి


ఊరికే వచ్చి పిస్టల్ ఎత్తి షూట్ చేశాడు. జాతరలో పిల్లలు తుపాకీ పట్టుకుని ఎదురుగా ఉన్న గాలిబుడగలను షూట్ చేసినట్టుగానే.. షూట్ చేశాడు. రిజల్ట్ మాత్రం ఎవరూ ఊహించలేదు. యూసుఫ్ డికెక్ సిల్వర్ మెడల్ సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఆయన సిల్వర్ అందిపుచ్చుకున్నాడు. దీంతో మనోడు సెన్సేషన్ అయ్యాడు. సోషల్ మీడియాలో డికెక్ పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఆశ్చర్యాలు.. మీమ్‌లు కూడా వస్తున్నాయి.

ఇలా తన ఫీట్ వైరల్ కావడంపై యూసుఫ్ డికెక్ స్పందించారు. ‘ఔను. నాకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. నేను ఒక నేచురల్ షూటర్‌ను’ అని సమాధానం చెప్పారు.

Related News

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి

Virender Sehwag son : సెహ్వాగ్ కుమారుడి బ్యాటింగ్ చూశారా.. తండ్రిని మించిపోయి ఆడుతున్నాడుగా.. ఇదిగో వీడియో

Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Big Stories

×