Lavanya case:గత ఏడాది సుమారుగా 7 నెలల క్రితం హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) తనను మోసం చేశాడు అంటూ కేసు పెట్టిన లావణ్య (Lavanya) కేసులో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. గత కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య గా మొదలైన ఈ స్టోరీలో రకరకాల పాత్రలు, ఎవరు ఊహించని విషయాలు బయటకి వస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక ఇన్ని రోజులు రాజ్ తరుణ్ మాత్రమే తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన లావణ్య..ఇప్పుడు మస్తాన్ సాయి(Mastan Sai) అనే వ్యక్తి వద్ద దాదాపు 300 అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించింది. ఈ హార్డ్ డిస్క్ కైవసం చేసుకున్న పోలీసులు.. అటు మస్తాన్ సాయిని కూడా అరెస్టు చేశారు.
నా జీవితం నాశనం అవ్వడానికి లావణ్య కారణం – ఫ్రెండ్ ప్రీతి..
అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇప్పుడు మరో వ్యక్తి బయటకి వచ్చారు. లావణ్య తన జీవితం నాశనం చేసింది అంటూ ఆమె ఫ్రెండ్ ప్రీతి సంచలన కామెంట్లు చేయడంతో అందరూ ఉలిక్కిపడుతున్నారు. తాజాగా లావణ్య గురించి షాకింగ్ విషయాలు ఆమె బయట పెట్టింది. ప్రీతి మాట్లాడుతూ..” లావణ్య నాకు డ్రగ్స్ అలవాటు చేసింది. నాకు మాత్రమే కాదు నాతో పాటు చాలామందికి ఆమె డ్రగ్స్ అలవాటు చేసింది. లావణ్య కన్నుపడితే ఎంతటి వారైనా సరే పడాల్సిందే.. చాలామంది ఫోన్లు లాక్కొని, వారిని ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. అలాగే మస్తాన్ సాయి ఫోన్లో ఉన్న వీడియోలను తన ఫోన్ లోకి ఎక్కించుకొని గత రెండేళ్లుగా మస్తాన్ సాయిని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోంది” అంటూ ప్రీతి తెలిపింది. ఇక ప్రస్తుతం ప్రీతీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అంటూ లావణ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.
లావణ్యపై ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్న బిగ్ బాస్ శేఖర్ బాషా..
ఇదిలా ఉండగా లావణ్య.. మస్తాన్ సాయి తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష (Sekhar basha) పై కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. శేఖర్ భాష, మస్తాన్ సాయి ఇద్దరూ కలసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్లాన్ చేసుకున్నారని, అందుకు సంబంధించిన కాల్ ఆడియో రికార్డింగ్ లు కూడా ఆమె పోలీసులకు అందించింది.ఈ నేపథ్యంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జే శేఖర్ భాష మాట్లాడుతూ.. “లావణ్య చెప్పేదంతా అబద్ధము. మేము అందరం పార్టీ చేసుకున్నాము. ఆ పార్టీలో లావణ్య డ్రగ్స్ తీసుకుంది. మమ్మల్ని టెస్ట్ చేశారు కదా మరి ఆమెను కూడా టెస్ట్ చేసే ధైర్యం మీకుందా? అంటూ నేరుగా పోలీసులకే ఆయన సవాలు విసిరారు. తర్వాత ప్రీతితో పాటు పలువురు పేర్లు తీస్తూ లావణ్య వారందరికీ డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేసింది అంటూ తెలిపారు.. ముఖ్యంగా లావణ్య లాంటి వాళ్ళ బుట్టలో ఎంతోమంది పోలీసులు ఉన్నారని , వారంతా లావణ్య చెప్పినట్లే వింటున్నారని” శేఖర్ భాష చెప్పుకొచ్చారు. మొత్తానికైతే లావణ్య గురించి రోజుకొక వ్యక్తి మీడియా ముందుకు వస్తూ నిజాలు చెబుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.