BigTV English

NZ vs Pak: స్టేడియంలో బాంబుల భయం.. పరిగెత్తిన న్యూజిలాండ్ క్రికెటర్లు !

NZ vs Pak: స్టేడియంలో బాంబుల భయం.. పరిగెత్తిన న్యూజిలాండ్ క్రికెటర్లు !

NZ vs Pak: ఓ ఐసీసీ ఈవెంట్ ని పాకిస్తాన్ హోస్ట్ చేసి చాలాకాలం అయిపోయింది. 2009 లాహోర్ ఉగ్రదాడి పాకిస్తాన్ క్రికెట్ ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సంఘటన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ జట్లు అక్కడికి వెళ్లి ఆడేందుకు సంకోచించాయి. దీంతో పాకిస్తాన్ హోమ్ మ్యాచ్ లు యూఏఈ లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రతా కారణాల దృశ్య పాకిస్తాన్ కి వెళ్లి క్రికెట్ ఆడాలంటేనే అన్ని జట్లు భయపడేవి. అలా కొన్నేళ్లపాటు ఆ దేశానికి ఏ జట్టు కూడా వెళ్లలేదు.


 

కానీ 2019 తర్వాత దశలవారీగా అంతర్జాతీయ క్రికెట్ పాకిస్తాన్ లో తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు ధైర్యం చేసి పాకిస్తాన్ లో సిరీస్ లు ఆడటం మొదలుపెట్టాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ పాకిస్తాన్ కి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతంగా నిర్వహించడం ద్వారా పాకిస్తాన్ భద్రతా ప్రమాణాలను ప్రపంచానికి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ భారత జట్టు మాత్రం పాకిస్తాన్ కి వెళ్లలేదు. భారత్ తన పూర్తి మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడబోతోంది.


కానీ మిగతా దేశాలు మాత్రం పాకిస్తాన్ కి వెళ్లి క్రికెట్ ఆడుతున్నాయి. ఇలా చాలాకాలం తర్వాత ఐసీసీ ఈవెంట్ పాకిస్తాన్ లో జరుగుతుండడంతో క్రికెటర్లు, బోర్డు సభ్యులు, అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ ఎంత చేసినా పాకిస్తాన్ అంటే ఎంతో కొంత భయం మాత్రం క్రికెటర్లను వెంటాడుతూనే ఉంటుంది. అలా లోలోపల బిక్కుబిక్కుమంటూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న న్యూజిలాండ్ క్రికెటర్లు.. నిన్న పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఒక్కసారిగా బాంబులు పడుతున్నాయేమోనని భయపడ్డారు.

ఈ ఘటన ఛాంపియన్స్ ట్రోఫీలోని తొలి మ్యాచ్ ప్రారంభం కాబోయే కొన్ని క్షణాల ముందు చోటు చేసుకుంది. మ్యాచ్ కి ముందు న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన పాకిస్తాన్ క్రీడాభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుదేశాల జట్లు తమ జాతీయ గీతాలను ఆలపిస్తున్న సమయంలో పాకిస్తాన్ జాతీయ జెండాలను రిలీజ్ చేసుకుంటూ స్టేడియం పైనుండి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లు దూసుకెళ్లాయి. ప్రతిష్టాత్మకమైన టోర్నీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వేడుకల్లో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.

 

అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో మరోసారి ఎయిర్ క్రాఫ్ట్ లు దూసుకొచ్చాయి. కానీ ఈసారి ఓ పెద్ద సౌండ్ వచ్చింది. దీంతో బ్యాటింగ్ కి దిగేందుకు రెడీ అవుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ డేవాన్ కాన్వే.. ఒక్కసారిగా బాంబులు పడుతున్నాయేమోనని కిందికి వంగాడు. అతడి పక్కనే ఉన్న మరో ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఉలిక్కిపడ్డారు. అలాగే స్టేడియంలో ఉన్న పాకిస్తాన్ క్రీడాభిమానులు కూడా భయపడ్డారు. ఆ తరువాత విషయం తెలుసుకొని అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఆ ఎయిర్ క్రాఫ్ట్ లకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by BUILDUP BAABU (@buildup_baabu)

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×