E-Paper
Advertisement

OTT Movie : భార్యను బార్ లో డాన్సర్ ను చేసే భర్త … ట్విస్ట్ లతో అదరగొట్టే ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : భార్యను బార్ లో డాన్సర్ ను చేసే భర్త … ట్విస్ట్ లతో అదరగొట్టే ఫ్యామిలీ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల కథలతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని కథలు రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి. ఇటువంటి సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే బాలీవుడ్ మూవీలో భార్యని బార్ గర్ల్ గా పెట్టాల్సివస్తుంది భర్త. ఆ తర్వాత వీళ్ళ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

2014 లో వచ్చిన ‘సిటీలైట్స్’ (City Lights) అనే ఈ మూవీకి హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్‌కుమార్ రావు, నటి పాత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్ భట్, ముఖేష్ భట్‌లతో కలిసి ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రాజస్థాన్‌కు చెందిన ఓ పేద రైతు జీవనోపాధి కోసం ముంబైకి రావడం తో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ 30 మే 2014న విడుదల అవ్వడంతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. కేవలం 350 స్క్రీన్‌లలో విడుదలైనప్పటికీ, తక్కువ నిర్మాణ వ్యయం, బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్ల కారణంగా సిటీలైట్స్ విజయవంతమైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

దీపక్ ఆర్మీలో డ్రైవర్ గా పనిచేసి రిటైర్డ్ అవుతాడు.ఇతనికి లక్ష్మీ అనే భార్య,ఒక కూతురు కూడా ఉంటుంది. తన సొంత ఊరికి వచ్చి బట్టల దుకాణం తెరుస్తాడు. అందులో నష్టాలు రావడంతో, సిటీకి వెళ్లి డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. అలా చేస్తే కూతుర్ని కూడా మంచిగా చదివించవచ్చని, కుటుంబంతో సహా సిటీకి వెళ్తాడు. సిటీలో సహాయం చేస్తానన్న వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని, ఒక వ్యక్తి వీళ్ళను మోసం చేస్తాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో వీళ్ళు చాలా బాధలు పడతారు. ఈ క్రమంలో లక్ష్మికి బార్ లో డాన్సర్ గా పనిచేసే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె ప్రిగ్నెంట్ కావడంతో, తనస్తానంలో ఉద్యోగం చేయమని చెప్తుంది.

అయితే బార్లో మగవాళ్ళు అప్పుడప్పుడు చేతులు వేస్తారని, అంతకు మించి ఏమీ చేయరని చెప్తుంది. వేరే దారి లేక ఆ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటుంది లక్ష్మీ. ఈ విషయం తెలిసి భర్త కూడా బాధపడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు దీపక్ కి కూడా జాబ్ వస్తుంది. సెక్యూరిటీ ఏజెన్సీలో లాకర్లను భద్రపరిచే పని దొరుకుతుంది. అందులో విలువైన వస్తువులు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో అనుకోని మలుపు జరుగుతాయి. ఆ అలుపులు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సిటీలైట్స్’ (City Lights) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×