BigTV English

Raj Tarun – Lavanya: షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. దీంతో రాజ్ తరుణ్ అడ్డంగా దొరికినట్టే..?

Raj Tarun – Lavanya: షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. దీంతో రాజ్ తరుణ్ అడ్డంగా దొరికినట్టే..?

Raj Tarun – Lavanya:లావణ్య(Lavanya), రాజ్ తరుణ్ (Raj Tarun) కేసులో రోజుకొక ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక నిన్నటికి నిన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వల్ల తనకు ప్రాణహాని ఉంది అంటూ తెలిపిన లావణ్య.. ఇప్పుడు సడన్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియోని సడన్గా రిలీజ్ చేసింది లావణ్య. అందులో రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు బట్టలు ఇచ్చి, రాజ్ తరుణ్ తో కలిసి లావణ్య వారి ఆశీర్వాదం తీసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. లావణ్య , రాజ్ తరుణ్ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకున్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ మరొకటి ఉంటుందా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇంక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


న్యాయం జరగకపోతే ప్రాణాలు విడుస్తా – లావణ్య..

ఇకపోతే టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ , లావణ్య కేసులో గత ఏడాది రోజుకొక ట్విస్టు బయటపడిన విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య ఈ కేసులో ఎలాంటి హడావిడి లేదు. అయితే సడన్ గా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి లావణ్య వెళ్లడంతో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు , వారి అనుచరులు రాత్రి సమయంలో తన ఇంటిపై రాత్రి సమయంలో ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా రాజ్ తరుణ్ , అతడి తల్లిదండ్రులపై తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని కూడా ఆరోపించింది. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పినా.. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తాను అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.


వాగ్వాదానికి దిగిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు..

ఇక దీనికి తోడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని వదిలి వెళ్లాలని వాగ్వాదానికి దిగారు. ఇక ఈ విషయంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన పైన 15 మందితో కలిసి ఒకేసారి దాడికి దిగారని లావణ్య ఆరోపించింది. ఇక ఈ విషయంపైనే ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఇక నిన్నటి నుంచి ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతుండగా.. ఇప్పుడు సడన్గా ఒక వీడియో రిలీజ్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..ఏది ఏమైనా లావణ్య కేసు ఇప్పట్లో తేలేలా లేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Also Read:Mahesh Babu : తల్లి అంటే ఎంత ప్రేమో.. జయంతి రోజు రిలీజ్ అయిన మహేష్ సినిమా ఏంటో తెలుసా..?

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×