BigTV English

Mahesh Babu : తల్లి అంటే ఎంత ప్రేమో.. జయంతి రోజు రిలీజ్ అయిన మహేష్ సినిమా ఏంటో తెలుసా..?

Mahesh Babu : తల్లి అంటే ఎంత ప్రేమో.. జయంతి రోజు రిలీజ్ అయిన మహేష్ సినిమా ఏంటో తెలుసా..?

Mahesh Babu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పుడు సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైన ఈయన.. మరో భాషలో సినిమా చేయకుండా అందరిని ఆశ్చర్యపరిచారు.. కానీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘ SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మహేష్ బాబు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా ఇప్పుడు.. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మే నుండి జూన్ నెల ఎండింగ్ వరకు బోట్ లో ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ జరగనుంది అని సమాచారం. ఇక ఇందులో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలకపాత్ర పోషిస్తూ ఉండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithvi Raj Sukumaran) విలన్ గా నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


తల్లితో వున్న మధుర జ్ఞాపకాలను పంచుకున్న మహేష్ బాబు..

ఇదిలా ఉండగా మహేష్ బాబు.. ఈరోజు తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు కావడంతో తన తల్లితో గడిపిన మధురమైన క్షణాన్ని ఫోటో రూపంలో షేర్ చేసి “మిస్ యూ అమ్మ నీ గురించి చెప్పడానికి మాటల్లేవ్” అంటూ కొటేషన్ పంచుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే మహేష్ బాబుకి తన తల్లి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే తన తల్లి జయంతి సందర్భంగా తన సినిమాను విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్ బాబు.ఏప్రిల్ 20వ తేదీన ఇందిరా దేవి పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె మన మధ్య లేకపోయినా మహేష్ బాబు మాత్రం ఎప్పటికప్పుడు ఆమెను గుర్తు చేస్తూ తల్లిపై ఉన్న ప్రేమను ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు.


ఇందిరా దేవి పుట్టినరోజు నాడు విడుదలైన మహేష్ మూవీ

ఈ క్రమంలోనే తన తల్లి ఇందిరా దేవి జయంతి రోజు నాడు.. మహేష్ బాబు హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భరత్ అనే నేను’. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు . దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.. ఈ సినిమా ఒక విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. అతడి పేరు భరత్. అనుకోకుండా ఆయన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవుతారు.. పాలిటిక్స్ , యాక్షన్ మిక్స్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. 2018 ఏప్రిల్ 20వ తేదీన తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నాడు ఈ సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ బాబు మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసో లేదో ఏప్రిల్ 20 మా అమ్మ పుట్టినరోజు.. అదే రోజు నేను నటిస్తున్న భరత్ అనే నేను సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది” అంటూ తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×