Chahal-RJ Mahvash: టీమిండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ తన ప్రియురాలు RJ మహ్వాష్ ( RJ Mahvash) తో మరోసారి మెరిశాడు. ఈ మధ్య కాలంలో… RJ మహ్వాష్ తో తెగ తిరుగుతున్న యుజ్వేంద్ర చాహల్… తాజాగా ఇద్దరు ఒకే బస్సులో వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. ఇద్దరు కలిసి.. పంజాబ్ కింగ్స్ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా చాలా రొమాంటిక్గా ఒకరినొకరు చూసుకుంటూ… బస్సు ఎక్కిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: MI VS CSK: ప్రమాదంలో CSK.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
ధనశ్రీ వర్మకు విడాకులు… ఆ బ్యూటీతో చాహల్ ఎంజాయ్
ధన శ్రీ వర్మ అలాగే యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే… చాహల్ గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆమెకు విడాకులు ఇచ్చి RJ మహ్వాష్ అనే అమ్మాయిని చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే చాహల్ అలాగే RJ మహ్వాష్ ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకొని తిరిగారు. దుబాయిలో మొన్న చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా చాహల్ అలాగే RJ మహ్వాష్ ఇద్దరు కలిసి… మ్యాచ్ తిలకించారు. అక్కడే కాకుండా రెస్టారెంట్లు అలాగే బార్లు… ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత… ఈ జంట ఒక అడుగు ముందుకేసి విచ్చలవిడిగా తిరుగుతోంది. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగితే కచ్చితంగా గ్రౌండ్లో RJ మహ్వాష్ ఉంటుంది. యుజ్వేంద్ర చాహల్ వికెట్ తీసినప్పుడు… RJ మహ్వాష్ ఎంజాయ్ అంతా కాదు. విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఇద్దరూ ఎలాగా గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తారో… అచ్చం ఈ జంట కూడా అలాగే ఎంజాయ్ చేస్తోంది. లేటెస్ట్ గా పంజాబ్ కింగ్స్ బస్సు లోనే ఇద్దరు కలిసి… వెళ్లిన వీడియో కూడా బయటకు వచ్చింది. దింతో ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. ప్రస్తుతం వీరి మధ్య రిలేషన్ ఉందని… కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: IPL 2025 : SRH లో ఒక్క మ్యాచ్ ఆడలేదు.. బయటికి వెళ్ళాక దుమ్ము లేపుతున్నారు..
ధనశ్రీ వర్మ కు విడాకులు
2020 సంవత్సరంలో ధనశ్రీ వర్మ అలాగే యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 2022 సంవత్సరానికి వచ్చేసరికి.. యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి వేరుగానే ఉంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరికీ ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా దాదాపు నాలుగు కోట్లకు పైగా భరణం ధన శ్రీ వర్మ కు టీమిండియా క్రికెటర్ చాహల్ ఇవ్వడం జరిగింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">