BigTV English

Motorola Razr 50 Ultra : ఇచ్చిపడేసిన అమెజాన్.. తాజాగా లాంఛ్ అయిన ఫోన్ పై ఏకంగా రూ.45వేల డిస్కౌంట్

Motorola Razr 50 Ultra : ఇచ్చిపడేసిన అమెజాన్.. తాజాగా లాంఛ్ అయిన ఫోన్ పై ఏకంగా రూ.45వేల డిస్కౌంట్

Motorola Razr 50 Ultra : అతి తక్కువ ధరకే ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే కస్టమర్స్ కు Motorola Razr 50 Ultra బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.55వేలకంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇక ఇంకెందుకు ఆలస్యం… ఈ మెుబైల్ ఫీచర్స్, ధర, స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్కేయండి.


ఫోల్డబుల్ మెుబైల్స్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఒక్కొక్కటిగా ఫీచర్స్ ను అప్డేట్ చేస్తూ ఫోల్డబుల్ మొబైల్స్ ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్నాయి. ఇక కొన్నాళ్ల క్రితమే మోటోరోలా సైతం బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ను కస్టమర్స్ కోసం తీసుకురాగా ప్రస్తుతం ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ ఆఫర్ ఉంది. ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం అమెజాన్ సైతం బెస్ట్ సేల్స్ ను తీసుకువస్తుంది. ఇలా Motorola Razr 50 Ultra ఫోన్ రూ. 54,299కే అమెజాన్ లో అందుబాటులో ఉండగా.. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఎక్స్ఛేంజ్ సదుపాయంతో పాటు ఫోన్ కొన్న కస్టమర్స్ కు Moto Buds సైతం ఉచితంగా లభిస్తాయి.

Motorola Razr 50 Ultra Amazon –


ఈ ఏడాది ప్రారంభంలో లాంఛ్ అయిన Motorola Razr 50 Ultra ప్రారంభ ధర రూ. 99,999గా ఉంది. అయితే అమెజాన్ లో ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.10వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 25,700 అమెజాన్ అందిస్తుంది. ఇలా బ్యాంక్ అమెజాన్ ఆఫర్స్ తో కొనుగోలు చేస్తే ఈ ఫోన్ ను రూ. రూ. 54,299కే కొనేయెుచ్చు. ఈ ఫోన్ తో పాటు రూ. 1333 విలువ చేసే మోటో ఇయర్ బడ్స్ సైతం ఉచితంగ్ అందిస్తుంది అమెజాన్. ఈ బడ్స్ Hi Res ఆడియోను కలిగి ఉన్నాయి.

Motorola Razr 50 Ultra స్పెసిఫికేషన్స్ – Motorola Razr 50 Ultra 1272 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 4 అంగుళాల LTPO AMOLED ఔటర్ డిస్‌ప్లే లాంఛ్ అయింది. డాల్బీ విజన్, HDR10+ 10 బిట్ కలర్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. ఈ డిస్‌ప్లే 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ తో పని చేస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌, 6.9 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మెుబైల్ లో డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50MP మెుయిన్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. 4000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ తో అందుబాటులో ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, A-GPS, NFC తో పాటు USB టైప్ సీ – పోర్ట్ కు సపోర్ట్ చేస్తుంది.

ALSO READ : క్లిక్ కొట్టు.. ఫేక్ ఫోటో పట్టు.. అలరించబోతున్న వాట్సాప్ కొత్త ఫీచర్

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×