E-Paper
Advertisement

Leo 2 : “లియో” సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన లోకేష్ కనగరాజ్

Leo 2 : “లియో” సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన లోకేష్ కనగరాజ్
Advertisement

Leo 2 : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు ఆయన లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) తో తీసిన ‘లియో’ (Leo) మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా? ఉంటే అది ఎప్పుడు తెరపైకి రాబోతోంది? అనే అనుమానాలు విజయ్ ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj).

కోలీవుడ్ స్టార్ విజయ్ (Vijay), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్  “లియో”. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో అదరగొట్టింది. ఈ మూవీ టైంలోనే త్రిష వివాదం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా “లియో” మూవీకి సీక్వెల్ వుంటే బాగుంటుంది అని ఎప్పటినుంచో విజయ్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనగరాజ్ టీం కు పలు సందర్భాల్లో ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా మరోసారి ‘బ్లడీ బెగ్గర్’ (Bloody Beggar) అనే సినిమాను వీక్షించిన లోకేష్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘లియో’ (Leo) సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

విజయ్ సినిమా ‘లియో’ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి రాబోతోంది ? అనే ప్రశ్న ఎదురు కాగా… లోకేష్ స్పందిస్తూ “విజయ్ అన్న అంగీకరిస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న ఆయన రాజకీయ నాయకుడిగా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు. కానీ నిజానికి విజయ్ ఇప్పుడు తాను చేస్తున్న సినిమా తర్వాత రాజకీయాలపైనే పూర్తిగా ఫోకస్ చేస్తానని, సినిమాలకు దూరమవుతానని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అభిమానుల కోరిక మేరకు ఆయన ఓవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు సినిమాలను చేస్తారా అనేది చూడాలి.

లోకేష్ కనగరాజ్ ఈ ప్రెస్ మీట్ లో తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘కూలీ’ మూవీపై అప్డేట్ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెండు షెడ్యూల్స్ లో పూర్తవుతుందని, ఆ తర్వాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చారు. లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ పేరుతో 2019లో రిలీజ్ అయిన ‘ఖైది’ సినిమాతో భారతీయ సినీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈ ఎల్సీయూలో భాగంగానే విక్రమ్ (Vikram), లియో (Leo) వంటి సినిమాలను తెరికెక్కించారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న ‘కూలి’ మూవీ అందులో భాగం కాదని, అది పూర్తి అయిన వెంటనే ఎల్సీయూలోని హీరోలు అందరితోనూ ఒక మూవీ చేయబోతున్నానని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అలాగే ‘లియో 2’ మూవీకి ‘పార్తిబన్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు వెల్లడించారు.  ప్రస్తుతం విజయ్ ‘దళపతి 69’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×