BigTV English
Advertisement

Kollywood: సెలబ్రిటీ డాగ్ ని బలి తీసుకున్న దీపావళి సెలబ్రేషన్స్… సినిమాలో జరిగినట్టే…!

Kollywood: సెలబ్రిటీ డాగ్ ని బలి తీసుకున్న దీపావళి సెలబ్రేషన్స్… సినిమాలో జరిగినట్టే…!

Kollywood: కోలీవుడ్ లో దీపావళి సందర్భంగా విషాదం నెలకొంది. ఒక సెలబ్రిటీ కుక్క దీపావళి సెలబ్రేషన్స్ కు బలి కావడం మూవీ లవర్స్ ను విషాదంలో ముంచెత్తింది. పైగా ఆల్మోస్ట్ అది నటించిన సినిమాలో జరిగినట్టే రియల్ లైఫ్ లో కూడా ఆ కుక్క చావు ఉండడం అందరిని కదిలిస్తోంది. మరి ఆ కుక్క కథ ఏంటి? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే…


ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ (Mari Selvaraj) ‘పరియేరుమ్ పెరుమాళ్’ (Pariyerum Perumal ) అనే సినిమాతో కోలీవుడ్లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఆ తర్వాత కర్ణన్, మామన్నన్ అనే సినిమాలను రూపొందించారు. నెక్స్ట్ ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కొత్త మూవీ చేయబోతున్నట్టుగా కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై డైరెక్టర్ క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్ తో కథకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయంటూ గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే ఆయన ప్రస్తుతం “వాళై” అనే మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి రోజు మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి మూవీ ‘పరియేరుమ్ పెరుమాళ్’లో కనిపించిన ఒక కుక్క చనిపోవడం అందరిని విషాదంలో ముంచెత్తింది.

సాధారణంగా మనం దీపావళి సంబరాల్లో మునిగితే, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే టాపాకాయల్ని పేలుస్తూ ఉంటాం. అయితే చాలామంది ఇలాంటి శబ్దాలు వల్ల చిన్న పిల్లలకు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి సమస్యగా మారుతుందనీ తెలిసినప్పటికీ ఏమాత్రం కేర్ చేయరు. ఇక మనుషుల పరిస్థితి ఇలా ఉంటే జంతువుల పరిస్థితి చెప్పాలా… దీపావళి నాడు ‘పరియేరుమ్ పెరుమాళ్’ (Pariyerum Perumal ) అనే సినిమాలో నటించిన కరుప్పి (Karppi) అనే కుక్కకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీపావళి సందర్భంగా పటాకులు పేలడంతో సినిమాలో నటించిన నల్ల కుక్క భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అంతలోనే అటుగా వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.


ఈ యాక్సిడెంట్ వల్ల కుక్క అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వాహనం ఎవరిది అన్న విషయం ఇంకా తెలియ రాలేదు. కానీ ఈ కుక్క యజమాని విజయముత్తుతో పాటు అదే గ్రామానికి చెందిన ప్రజలు కుక్కను పూడ్చి పెట్టినట్టుగా సమాచారం. అయితే సినిమాలో కూడా ఇలాగే హీరోపై పగ తీర్చుకోవడానికి ఈ కుక్కని రైల్వే ట్రాక్ కి కట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ లో కుక్క మరణిస్తుంది. కాగా ప్రతి ఏడాది దీపావళి నాడు ఈ పటాకుల వల్ల ఎంతోమంది గాయపడుతున్నారు. ఇక వీటివల్ల గాయపడే మూగజీవాల సంఖ్య లెక్క లేనంతగా ఉంటుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×