BigTV English

NTR: అదెలా అన్నా… సూపర్ హిట్ సినిమాలని మాత్రమే రిజెక్ట్ చేసావ్?

NTR: అదెలా అన్నా… సూపర్ హిట్ సినిమాలని మాత్రమే రిజెక్ట్ చేసావ్?

NTR: ఇండియా వైడ్ మాన్ ఆఫ్ మాస్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్—ఆల్ రౌండర్ అనిపించే టాలెంట్ అతనిలో ఉంది. కానీ, కొన్నిసార్లు సరికొత్త జానర్ ట్రై చేయలేకపోవడం, డేట్స్ క్లాష్ అవడం, స్క్రిప్ట్ అప్పట్లో నచ్చకపోవడం వంటి కారణాలతో కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అయితే, వీటిలో చాలా సినిమాలు ఘనవిజయాలు సాధించడంతో అభిమానులు “ఇవి ఎన్టీఆర్ చేసుంటే ఇంకెంత హిట్టయ్యేవి?” అని ఊహించుకునేలా చేసింది.


  1. దిల్ (2003)

ఈ సినిమా మొదట ఎన్టీఆర్‌కి ఆఫర్ ఇచ్చారు. కానీ, ఆయన అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకి వెళ్లింది. ఇక డైరెక్టర్ వీవీ వినాయకే=క్—దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లో హిట్‌గా నిలిచింది.

  1. ఆర్య (2004)

“ఆర్య” సినిమా కోసం మొదట ఎన్టీఆర్‌ను సంప్రదించారు. అయితే, అప్పట్లో ఈ కథ చాలా రిస్కీగా అనిపించడంతో ఆయన రిజెక్ట్ చేశారు. చివరికి ఈ సినిమా అల్లు అర్జున్ చేతికి వెళ్లింది. బన్నీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఈ సినిమా, ఆయన్ను “స్టైలిష్ స్టార్”గా మార్చేసింది.


  1. భద్ర (2005)

బోయపాటి శ్రీను, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కాల్సిన ఈ సినిమాను ఎన్టీఆర్ డేట్స్ సమస్యల వల్ల చేయలేదు. చివరికి రవితేజ చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

  1. అతనొక్కడే (2005)

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన “అతనొక్కడే” సినిమా కూడా మొదట ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. కానీ, చివరికి ఈ ప్రాజెక్ట్ కళ్యాణ్ రామ్‌కి వెళ్లింది.

  1. కిక్ (2009)

‘కిక్’ సినిమాను మొదట ఎన్టీఆర్‌కి కథ చెప్పారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ చేయలేదు. రవితేజ చేసిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

  1. కృష్ణ (2008)

వీ.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా మొదట ఎన్టీఆర్‌కి ఆఫర్ చేశారు. కానీ, డేట్స్ సమస్యల వల్ల ఆయన చేయలేకపోయారు. ఈ సినిమా రవితేజ చేతిలో ఘనవిజయం సాధించింది.

  1. శ్రీమంతుడు (2015)

కొరటాల శివ మొదట ఈ సినిమాను ఎన్టీఆర్‌కి కథగా వినిపించారు. కానీ, ఎన్టీఆర్ వద్దని చెప్పడంతో ఈ సినిమా మహేష్ బాబు చేతికి వెళ్లింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మహేష్‌కి “ప్రిన్స్” అనే ఇమేజ్‌ని మరింత పెంచింది.

  1. ఊపిరి (2016)

ఈ చిత్రాన్ని మొదట ఎన్టీఆర్‌కి ఆఫర్ చేశారు. కానీ, ఆయన ప్రాజెక్ట్‌ వదులుకోవడంతో నాగార్జున, కార్తీ ఈ సినిమాలో నటించారు. కొత్త తరహా కథగా తెరకెక్కిన ఈ సినిమా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

  1. రాజా ది గ్రేట్ (2017)

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మొదట ఎన్టీఆర్‌కి కథ చెప్పగా, ఆయన రెడీ కాలేదు. అలా ఈ సినిమా రవితేజ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయ్యింది.

  1. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)

ఈ సినిమా స్క్రిప్ట్ మొదట ఎన్టీఆర్‌కి వినిపించారు. కానీ, ఆయన వద్దని చెప్పడంతో అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది.

పెద్దికూడా లిస్ట్‌లో చేరుతుందా?

ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ బర్త్ డే రోజున రిలీజ్ అయిన “పెద్ది” ఫస్ట్ లుక్‌ పోస్టర్ చూసిన నందమూరి ఫ్యాన్స్, “ఇది ఎన్టీఆర్ చేసి ఉండాల్సిన సినిమా” అని కామెంట్స్ చేస్తున్నారు. మొదట ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్, చివరికి రామ్ చరణ్ చేతికి వెళ్లిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ లిస్ట్‌లోని కొన్ని సినిమాలు అప్పటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడం తప్పేమీ కాదు. కానీ కొంచెం డేట్స్ అడ్జస్ట్ చేసి ఎన్టీఆర్ పెద్ది సినిమా చేసి ఉంటే మంచి వేరియేషన్ ఉండేది. మరి ఇది ఎన్టీఆర్ కి ఎంత కాస్ట్లీ మిస్ అవుతుందనేది చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×