BigTV English

Lucky Baskhar : ‘పార్టీ ఇస్తా’… నాగ వంశీ ఈ సినిమాకు కూడా స్టార్ట్ చేశాడు

Lucky Baskhar : ‘పార్టీ ఇస్తా’… నాగ వంశీ ఈ సినిమాకు కూడా స్టార్ట్ చేశాడు

Lucky Baskhar : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Producer Nagavamsi) ఇటీవల కాలంలో వరుసగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న ‘1500 పెట్టి ఒక ఫ్యామిలీ సినిమా చూడలేరా? 3 గంటల ఎంటర్టైన్ ఎవ్వరూ ఇవ్వరు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తాజాగా మరోసారి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) మూవీ ఈవెంట్లో ఈ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


మలయాళ స్టార్ హీరో దొరకరు సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైన్ ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ (Producer Nagavamsi), సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘లక్కీ భాస్కర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా, చిత్ర బృందం మొత్తం పాల్గొంది. అయితే నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చేసిన కామెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

ఈవెంట్ లో భాగంగా ఓ జర్నలిస్ట్ ‘మ్యాడ్’ సినిమాకు టికెట్ రీఫండ్ అని స్కీం పెట్టారు మీరు.. ఈ సినిమాకు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని అడిగారు. వెంటనే నాగ వంశీ (Producer Nagavamsi) స్పందిస్తూ ‘నాకు తెలిసి ఈ సినిమాలో అలాంటి తప్పులను వెతకడం కష్టమే. అసలు ఆ తప్పులు అనేవి దొరకవేమో అని హోప్ కూడా ఉంది నాకు. ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్లందర్నీ పిలిచి పార్టీ ఇచ్చి, ఫోటోలు కూడా దిగుతాను’ అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చాలామంది ఇంత ట్రోలింగ్ జరిగినా నాగ వంశీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ప్రొడ్యూసర్ నాగ వంశీ (Producer Nagavamsi) ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి మూవీకి ఏదో ఒక స్పెషల్ కామెంట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ‘మ్యాడ్’ సినిమా బాగాలేదని ఎవరైనా అంటే టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తానని అప్పట్లో సంచలనం రేపారు. ఇక రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో ‘ఇలా చెబితే బలుపు అనుకుంటారు. కానీ ప్రతి ఏరియాలోను రాజమౌళి కలెక్షన్స్ దగ్గరగా వెళ్తాం. నేను విన్న కంటెంట్ తీసిన కంటెంట్ ఏంటో నాకు తెలుసు కదా.. మేము మా మాట మీద ఉన్నాము. గుంటూరు కారం మూవీ రిలీజ్ ను మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ మీరు చూసుకోండి’ అంటూ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు.

తీరా చూస్తే సినిమా నెగెటివిటీని ఎదుర్కొంది. దీంతో దారుణంగా ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది నాగ వంశీ. ఈ సినిమా అనే కాదు అంతకు ముందు వచ్చిన చాలా సినిమాల్లో ఇలాగే ఏదో ఒక స్పెషల్ కామెంట్ చేసి ఆయన హైలెట్ అయ్యారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సినిమా రిలీజ్ కి ముందు హైలెట్ అవుతాడు, రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ బాధితుడు అవుతారు నాగవంశీ (Producer Nagavamsi).

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×