E-Paper
Advertisement

Lucky Baskhar Teaser: లక్కీ భాస్కర్ టీజర్.. బ్యాంక్ ఉద్యోగి బడా స్కామ్..!

Lucky Baskhar Teaser: లక్కీ భాస్కర్ టీజర్.. బ్యాంక్ ఉద్యోగి బడా స్కామ్..!
Advertisement

Dulquer Salmaan’s Lucky Baskhar Teaser: మహానటి సినిమాతో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత సీతారామం సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. ఇక ఈ చిత్రాలతో వచ్చిన గుర్తింపుతో దుల్కర్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. గతేడాది దుల్కర్ తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అదే లక్కీ భాస్కర్. సార్ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వచిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బ్యాంక్ లో జరిగే బడా స్కామ్ ల గురించి చూపించినట్లు ముందుగానే తెలిపారు. టీజర్ లో కూడా ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఎలా ఉన్నత స్థానానికి చేరుకున్నాడో చూపించారు. భాస్కర్.. ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఉద్యోగి. అత్తెసరు జీతం.. అప్పులు.. పని ఎక్కువ జీతం తక్కువ. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్.. ఇలా సాగుతున్న అథైని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి అయిన భాస్కర్ అకౌంట్ లోకి కోట్లు వచ్చి పడతాయి. ఆ డబ్బును భాస్కర్ ఏం చేశాడు.. ? ఎలా కాపాడుకున్నాడు.. ? అసలు అంత డబ్బు అతనికి ఎలా వచ్చింది.. ? ఇదంతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

ఇక భాస్కర్ చివర్లో చెప్పే డైలాగ్.. “మిడిల్ క్లాస్ మెంటాలిటీ సర్.. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి రూపాయి దాచుకుంటాం.. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చుపెట్టేస్తాం” ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా జులై లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో దుల్కర్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Also Read: Priyamani: ఆ హీరో పిలవాలే కానీ, అన్ని వదిలేసి వెళ్ళిపోతా

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×