BigTV English

Priyamani: ఆ హీరో పిలవాలే కానీ, అన్ని వదిలేసి వెళ్ళిపోతా

Priyamani: ఆ హీరో పిలవాలే కానీ, అన్ని వదిలేసి వెళ్ళిపోతా

Priyamani: ప్రస్తుతం రీఎంట్రీ తరువాత బాగా రాణిస్తున్న హీరోయిన్స్ లో ప్రియమణి ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ.. పెళ్లి చేసుకొని కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరువాత బొద్దుగా మారడంతో కొంత సమయం తీసుకొని బక్కచిక్కి సెక్సీ లుక్ లోకి వచ్చింది. ఇక అప్పటినుంచి ముద్దుగుమ్మను ఆపడం ఎవరి తరం కావడంలేదు. తెలుగు, తమిళ్, హిందీ అంటూ ఎక్కడ చూసినా ప్రియమణినే కనిపిస్తుంది. ఈ మధ్యనే ఆహాలో భామా కలాపం తో మంచి హిట్ ను అందుకుంది. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఒక్కసారిగా బాలీవుడ్ బ్యూటీగా మారిపోయిన ఈ చిన్నది తాజాగా అజయ్ దేవగణ్ సరసన మైదాన్ లో మెరిసింది.


ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే.. ప్రియమణి తన ఫేవరేట్ హీరో గురించి చెప్పుకొచ్చింది. ప్రియమణి అభిమాన హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఆమెది అభిమానం కాదు విశ్వాసం అని చెప్పాలి. సాధారణంగా ఎవరైనా ఒక ఆఫర్ ఇచ్చి అది సక్సెస్ అయితే..చాలామంది ఆఫర్ ఇచ్చినవారిని మర్చిపోతూ ఉంటారు. కానీ, ప్రియమణి మాత్రం తనకు ఆఫర్ ఇస్తున్న షారుఖ్ ను అస్సలు మర్చిపోలేనని చెప్తుంది. ” నాకు చాలామంది హీరోలు ఇష్టం.. అందరికన్నా షారుఖ్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం.. ఆయన పిలవాలే కానీ, నా చేతిలో ఉన్న సినిమాలు అన్ని వదిలేసి వెళ్ళిపోతా” అని చెప్పుకొచ్చింది. మరి.. షారుఖ్ కూడా ప్రియమణి లోని నటనకు ముగ్దుడు అయ్యాడు.

మొట్టమొదటిసారి ఆమెను చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఒక ఐటెంసాంగ్ కు తీసుకున్నారు. ఆ తరువాత జవాన్ లో కూడా షారుఖ్ నే పిలిచి ఆ ఆఫర్ ఇచ్చాడంట. ఇంతగా ఆమె ప్రతిభను గుర్తించిన హీరో పిలిచినప్పుడు వెళ్లకపోతే అది విశ్వాసం అనిపించుకోదు కదా.. అందుకే ప్రియమణి సైతం నా చేతిలో ఉన్న సినిమాల కన్నా ఆయనతో పనిచేయడం అనేది నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ జంట ముచ్చటగా మూడోసారి ఏ సినిమాలో కనిపిస్తారో చూడాలి.


Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×