BigTV English

Offers on Okaya EV: ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్ల వర్షం.. వీటిని వదలొద్దు!

Offers on Okaya EV: ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్ల వర్షం.. వీటిని వదలొద్దు!

Huge Offers on Okaya EV: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. కంపెనీలు కూడా ఈవీల తయారీపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఒకాయ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఫాస్టర్ అడాప్షన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ FAME II తర్వాత కూడా ఒకాయ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పాత ధరలను కొనసాగించబోతోంది. ఒకాయన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.69,950 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కంపెనీ స్కూటర్లు 160 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. ఎక్కువ మంది కస్టమర్లను పొందాలను ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.


ఒకాయ EV మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అశుల్ గుప్తా మాట్లాడుతూ.. తమ కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా వాహనాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కస్టమర్ల అవసరాలు, ఆందోళనలను మేము అన్నింటికీ ముందు చూసుకుంటామని వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీని కేంద్రంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ స్కూటర్ల ధరను సరసమైన పరిధిలో ఉంచడానికి కూడా ప్రయత్నిస్తామని అన్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు. దీని కోసం FAME II ప్రవేశపెట్టిన తర్వాత కూడా పాత ధరలకు అందుబాటులో ఉంచామని అన్నారు.

ఒకాయ EV ధరలు పరిమితంగా మాత్రమే తగ్గించబడ్డాయి. ఒకాయ మోడల్స్ తగ్గిన ధరల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.


Also Read: కిర్రాక్ లుక్‌తో స్టైలిష్ ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ N250 కొత్త వెర్షన్!

  • ఫ్రీడమ్ ధర రూ.75,899. ఈ స్కూటర్ ధర రూ.69,950కి తగ్గింది.
  • ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ధర రూ.93,999. ఈ స్కూటర్ ధర రూ.89,950కి తగ్గింది.
  • ఫాస్ట్ ఎఫ్3 ధర రూ.1,44,946. ఈ స్కూటర్ ధర రూ.1,09,990కి తగ్గించబడింది.
  • మోటోఫాస్ట్ 35 ధర రూ.1,64,475. ఈ స్కూటర్ ధర రూ.1,24,999కి తగ్గింది.
  • ఫాస్ట్ F2B ధర రూ.1,19,233. ఈ స్కూటర్ ధర రూ.89,950కి తగ్గింది.
  • Faast F2T ధర రూ.1,15,092. ఈ స్కూటర్ ధర రూ.92,900కి తగ్గింది.
  • ఫాస్ట్ ఎఫ్4 ధర రూ.1,60,112. ఈ స్కూటర్ ధర రూ.1,19,989కి తగ్గింది.
  • క్లాసిక్ IQ+ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×