E-Paper
Advertisement

Lucky Bhaskar Collections : దుల్కర్ మాస్ ర్యాంపెజ్.. దుమ్ము దులిపేస్తున్న కలెక్షన్స్…?

Lucky Bhaskar Collections : దుల్కర్ మాస్ ర్యాంపెజ్.. దుమ్ము దులిపేస్తున్న కలెక్షన్స్…?
Advertisement

Lucky Bhaskar Collections : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లు గా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘లక్కీ భాస్కర్ ‘.. పేరులో లక్కీ ఉన్నట్లే సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. ఐదు రోజులకు గాను రూ. 55 కోట్లకు పైగా వసూల్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ఇంకా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.. మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పడ్డట్లే..

ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై పాపులర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి మొదలగు వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31 దీపావళి కానుకగా రిలీజ్ చేశారు. మౌత్ టాక్ బాగుండటంతో మూవీకి కాసుల వర్షం కురిపిస్తుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ మూవీ అందుకుంటుంది.

Advertisement

మొదటి రోజు నుంచి ఐదు రోజుల వరకు ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్ ను చూస్తే.. ఈ మూవీని సుమారుగా 1100 స్క్రీన్లలో ఇండియాలో, 1500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే కనీసం రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో రూ 6.10 కోట్లు, తమిళంలో రూ. 1.03 కోట్లు, మలయాళంలో రూ. 3.06 కోట్లు, ఓవర్సీస్‌ లో రూ. కోటి చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్ల ను సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు దుల్కర్ సల్మాన్. మొత్తంగా ఐదు రోజులకు గాను రూ. 55.4 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక పది రోజుల్లోనే 100 కోట్లు వసూల్ చేస్తుందని సినీ ట్రేడ్ పంతులు చెబుతున్నారు.. చూద్దాం అంతకు మించి రాబడుతుందేమో.. దీపావళి మూవీస్ విన్నర్ గా నిలవడం విశేషం..

ఇకపోతే దుల్కర్ సల్మాన్ గత సినిమాలు , నటుడి గా క్లీన్ ఇమేజ్, తెలుగు నాట యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.. సీతా రామం తర్వాత అలాంటి క్రేజ్ రావడం విశేషం.. ఈ సినిమా లాంగ్ రన్ టైం లో మంచి కలెక్షన్స్ ను అందుకుంటుందని టాక్..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×