BigTV English

OTT Movie : పిల్లలు పుట్టలేదని డాక్టర్ దగ్గరకు వెళ్తే… వణికించే సైకలాజికల్ హారర్ మూవీ

OTT Movie : పిల్లలు పుట్టలేదని డాక్టర్ దగ్గరకు వెళ్తే… వణికించే సైకలాజికల్ హారర్ మూవీ

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్ది రోజుల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే హాలీవుడ్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ ప్రేక్షకులను భయపెట్టి, ఓటిటిలో హల్చల్ చేస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్ (Hotstar)

ఈ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “క్లాక్” (Clock). హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్న ఒక జంట కి పిల్లలు కలగకపోవడంతో, తన తండ్రి సలహా ఇవ్వడంతో ఒక డాక్టర్ దగ్గర సైకలాజికల్ థెరపీని తీసుకుంటారు. అక్కడ ఆమెకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఈ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన భర్తతో కలసి సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటుంది. తనకి దాదాపు 40 సంవత్సరాలు వచ్చేంతవరకు పిల్లలు కలగకపోవడంతో ఈ జంటకి పిల్లలు కావాలనే కోరిక కలుగుతుంది. అందుకు ఆమె తండ్రి తనకు తెలిసిన ఒక డాక్టర్ని సంప్రదించండి అని చెప్తాడు. ఆ క్రమంలో ఆమె ఒక హాస్పిటల్ లో లేడి డాక్టర్ ని కలుస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి సమస్య ఏమి లేదని , సైక్లాజికల్ ట్రీట్మెంట్ ఒకటి తీసుకోవాలని ఆ డాక్టర్ హీరోయిన్ కు చెప్తుంది. దానితోపాటు హార్మోన్ తెరపి ఇస్తే సరిపోతుందని, ఆ తరువాత పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని హీరోయిన్ తో డాక్టర్ చెప్తుంది. హీరోయిన్ ట్రీట్మెంట్ చేసుకుంటుండగా ఆమెకు ఎదురుగా ఒక పొడవైన వ్యక్తి నల్లని ఆకారంలో తనని భయపెడుతూ కనిపిస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన ఆమెకు మళ్ళీ ఒక  పొడుగు మనిషి రూపం వచ్చి తనని భయపెడుతూ ఉంటుంది. ఈ విషయం తన తండ్రితో పంచుకుంటూ భయపడుతుంది.

ఒక సారి హీరోయిన్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ గా ఉండటంతో తనని కలవటానికి ఇంటికి వస్తుంది. అప్పుడు ఆమె కడుపు మీద గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రమాదం నుంచి ఆమె ఫ్రెండ్ తప్పించుకుంటుంది. ఆమె తండ్రి కొన్ని ఫోటోలు చూస్తూ ఉండగా చనిపోయిన ఆమె నానమ్మ రూపం, ఆమెను భయపెడుతున్న రూపం ఒకటేనని తండ్రితో చెప్తుంది. ఆ తర్వాత ఆమె తన భర్త ద్వారా కొన్ని నిజాలు తెలుసుకుంటుంది. ఇంతకీ ఆమెకు తెలిసిన నిజాలేమిటి? ఆ భయపెడుతున్న దయ్యం ఎందుకు ఆమె వెంటపడుతుంది? చివరికి వీళ్ళకు పిల్లలు పుడతారా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న అమెరికన్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ “క్లాక్” (Clock) ని తప్పకుండా చూడండి. ఈ మూవీని ఒంటరిగా చూడకపోవడమే బెటర్. మూవీ లవర్స్ ని కాస్త ఎక్కువగానే ఈ మూవీ భయపెడుతుంది. మరెందుకు ఆలశ్యం ఈ థ్రిల్లర్ మూవీ పై ఓ లుక్ వెయ్యండి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×