E-Paper
Advertisement

Maa Nanna Super Hero Teaser: నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు.. టీజర్ అదిరింది

Maa Nanna Super Hero Teaser: నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు.. టీజర్ అదిరింది
Advertisement

Maa Nanna Super Hero Teaser: నవ దళపతి సుధీర్ బాబు ఈ ఏడాది హరోంహర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని  అందించలేకపోయినా సుధీర్  కు మాత్రం మంచి  మార్కులే పడ్డాయి. విజయాపజయాలను  లెక్కచేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం మా నాన్న సూపర్ హీరో.

లూజర్  అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న డైరెక్టర్ అభిలాష్ కంకర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.   ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  తాజాగా మా నాన్న  సూపర్ హీరో టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Advertisement

” ఏను సంపాదిస్తున్నాను కదా నాన్న.. ఇంకా ఎందుకు నువ్వు డబ్బుల కోసం కష్టపడడం, గొడవలు పడడం” అనే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. ఇందులో సుధీర్  తండ్రులుగా  సాయి చాంద్, షియాజీ షిండే కనిపించారు. ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కొక్కరిని సుధీర్ నాన్న అని పిలవడం కన్ఫ్యూజ్ గా ఉన్నా తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధాన్ని  ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారని తెలుస్తోంది.

సాధరణంగా తండ్రీకూతుళ్ల మధ్య  బంధాన్ని, ప్రేమను అందరు ఎంతో అందంగా చూపిస్తారు. కానీ, తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమ.. గొడవలతోనే ఉంటుంది. ఆ బాండింగ్ ను ఈ సినిమాలో చూపించారని తెలుస్తోంది. మరి సుధీర్  అసలు తండ్రి ఎవరు.. ? తండ్రి కోసం ఈ కొడుకు ఏం చేశాడు.. ? అనేది సినిమా  చూసి తెలుసుకోవాల్సిందే.  ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. అక్టోబర్ 11 న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×