E-Paper
Advertisement

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు
Advertisement

Jani Master Case: టాలీవుడ్‌లో ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోవడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, బాధితురాలు అందరి ముందు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం వల్ల కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికీ ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు జానీ మాస్టర్ కేసుపై స్పందించారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ విషయంపై స్పందించారు. మా ప్రెసిడెంట్ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించని విష్ణు.. తాజాగా దీనిపై ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

శిక్ష తప్పదు

Advertisement

‘‘ఒకవేళ ఇది నిజంగా జరిగి ఉంటే మాత్రం ఇదొక క్షమించరాని నేరం. నిందులని కఠినంగా శిక్షించాలి. భారతీయ చిత్ర పరిశ్రమ అనేది అమ్మాయిలకు సేఫ్ ప్లేస్‌గా ఉండాలి. అమ్మాయిలు, మహిళలు ఇక్కడికి వేగంగా సంతోషంగా పని చేసుకోవాలి. ఆ వాతావరణాన్ని మనమే వారికి కల్పించాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకూడదు. ఒకవేళ ఇది జరిగి ఉంటే మాత్రం శిక్ష పడాల్సిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను దీని గురించి ఎక్కువ మాట్లాడలేను’’ అంటూ జానీ మాస్టర్ కేసుపై స్పందించారు మంచు విష్ణు. ఆయన మా ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసుంటే ఇండస్ట్రీ తరపున జానీ మాస్టర్‌కు శిక్ష కూడా విధించగలరు.

Also Read: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Advertisement

బాధితురాలి స్టేట్‌మెంట్

ఈ కేసు విషయానికొస్తే.. ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో బాధితురాలిని కలిశారు జానీ మాస్టర్. తన డ్యాన్స్ నచ్చి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా అవకాశమిచ్చారు. అలా తనతో పాటు సినిమాల షూటింగ్స్‌కు తనను కూడా తీసుకెళ్లేవాడు. ఒక సినిమా షూటింగ్ కోసం ముంబాయ్ వెళ్లినప్పుడు అక్కడ జానీ మాస్టర్ తనపై మొదటిసారి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అంతే కాకుండా ఈ విషయం ఇంకెవరికి అయినా చెప్తే.. తనకు డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలో అవకాశాలు రానివ్వను అని, అంతే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యేలా చేస్తానని ఆయన బెదిరించారని తెలిపింది. దీంతో బాధితురాలు చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టానని అంటోంది,

కొందరు అలా.. కొందరు ఇలా

అయితే ఇండస్ట్రీలో చాలామంది జానీ మాస్టర్ తప్పు చేశాడని నమ్ముతున్నారు. అందుకే తనకు తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం జానీ మాస్టర్ అలాంటివాడు కాదు అని, బాధితురాలే అబద్ధాలు చెప్తుందని ఆరోపిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు.. ఇండస్ట్రీలో పైస్థాయిలో ఉన్నవారిని టార్గెట్ చేసి వారి నుండి డబ్బులు కాజేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తారని పలువురు డ్యాన్సర్లు జానీ మాస్టర్‌కు మద్దతుగా నిలిచారు. కానీ జానీ మాస్టర్ మాత్రం తాను చేసిన తప్పులను ఒప్పుకున్నాడనే వార్త బయటికొచ్చింది. మాస్టర్ భార్య సైతం ఈ విషయంలో తన భర్త తప్పు ఏమీ లేదంటూ న్యాయం కోసం పోరడడానికి సిద్ధమయ్యింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×