BigTV English

MAD Square: మ్యాడ్ బాయ్స్.. మెంటలెక్కించడానికి మంచి డేట్ నే పట్టారు

MAD Square: మ్యాడ్ బాయ్స్.. మెంటలెక్కించడానికి మంచి డేట్ నే పట్టారు

MAD Square: చిన్న సినిమాలు ఒక్కోసారి ఎంత పెద్ద ఇంపాక్ట్  ను క్రియేట్ చేస్తాయో అందరికీ తెల్సిందే. గత రెండు మూడేళ్ల నుంచి చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడుతూ వస్తున్నాయి. అలా చిన్న సినిమాగా  ఎలాంటి హైప్ లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలో మ్యాడ్ ఒకటి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ హీరోలుగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి  అనే సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


ముగ్గురు స్నేహితుల కథాగ్ తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్  బ్యానర్  పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్యకు మంచి హిట్ ను అందించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రాబోతుందని మేకర్స్ ప్రకటించినప్పుడే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.  ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dakota Johnson: శ్రీ బాబుల్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన హాలీవుడ్ హీరోయిన్.. హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్, లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక మొదట నుంచి ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ఉన్నట్టుండి  మ్యాడ్ స్క్వేర్ 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసి దానికి  క్యాప్షన్ గా.. “మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్” అంటూ రాసుకొచ్చారు. పోస్టర్ అదిరిపోయింది.  భీమ్స్ సిసిరోలియో సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.

మ్యాడ్ కూడా చాలా పెద్ద సినిమాలతోనే పోటీకి దిగి మంచి హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాతోనే  పోటీ పడుతుంది. హరిహరవీరమల్లు మార్చి 28 న రిలీజ్ కు రెడీ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ కు మంచి డేట్ నే పట్టారు మేకర్స్. సమ్మర్ హీట్ ను తగ్గించే వినోదాన్ని అందిస్తున్న సినిమా కాబట్టి.. మ్యాడ్ స్క్వేర్ కు థియేటర్స్ లో మాములు హడావిడి ఉండదు. మరి ఈ సినిమా మొదటి భాగం కానన ఎక్కువ వినోదాన్ని పండిస్తుందా.. ? లేక  తేలిపోతుందా  అనేది తెలియాలంటే  కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×