Dakota Johnson: మన సినిమాలు పాన్ ఇండియాకు వెళ్లడమే కాదు.. మన సాంప్రదాయాలను కూడా విదేశీయులు చాలా గౌరవిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇండియన్స్ పాటించని హిందూ సాంప్రదాయాలను విదేశీయులు పాటిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాక్సన్.. తన భర్తతో కలిసి శ్రీ బాబుల్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది. డకోటా గురించి తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి తెలుసు.
హాలీవుడ్ హిట్ సినిమా 50 షేడ్స్ ఆఫ్ గ్రే తో ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మారింది. ఇందులో డకోటా నటన, ఇంటిమేటెడ్ సీన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత ఆరుసా సినిమాలతో బిజీ అయినా డకోటా.. గతేడాది మేడమ్ వెబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంత ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
Tollywood: అప్పుడు దాసరి.. ఇప్పుడు మోహన్ బాబు.. ఆస్తుల కోసం తండ్రుల పరువు తీస్తున్న కొడుకులు
ఇదంతా పక్కన పెడితే.. డకోటా.. 2017 నుంచి క్రిస్ మార్టిన్ తో రిలేషన్ లో ఉంది. అతనొక సింగర్. ప్రస్తుతం క్రిస్ కోల్డ్‌ప్లే అనే పేరుతో ప్రపంచం మొత్తం ప్రదర్శనలు ఇస్తుంది. తాజాగా ఈ జంట ముంబైలో సందడి చేశారు. అక్కడ ఎంతో ప్రసిద్ధమైన శ్రీ బాబుల్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. క్రిస్, స్థానిక సంస్కృతిని స్వీకరించి, రుద్రాక్ష మాలతో జత చేసిన పాస్టెల్ బ్లూ కుర్తాను ధరించగా డకోటా ప్రింటెడ్ కాటన్ సూట్‌లో తన తలపై గౌరవప్రదంగా దుపట్టాను కప్పుకొని అచ్చమైన భారతీయ మహిళను తలపించింది.
ఇక పూజారులు అక్కడ పూజ ఎలా చేయాలి అనేది నేర్పించారు. డకోటా తన కోరికను శివుని ముందు ఉన్న నంది చెవిలో చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. భారతీయ ఆచారాల పట్ల వీరిద్దరికి ఉన్న లోతైన గౌరవాన్ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.
ఇక క్రిస్ కోల్డ్ ప్లే వివరాల గురించి చెప్పాలంటే.. ముంబైలోని DY పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో మూడు రోజులు.. అనగా జనవరి 18, జనవరి 19 మరియు జనవరి 21 వరకు జరగనున్నాయి. దీని తరువాత జనవరి 25 మరియు జనవరి 26 తేదీలలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ బ్యాండ్ తమ ప్రదర్శనను ఇవ్వనుంది. వీరి ప్రదర్శన విజయవంతం అవ్వాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.