E-Paper
Advertisement

Pisasu 2 : ఆండ్రియా ఒంటిపై నూలు పోగు లేకుండా నటించిన హారర్ మూవీపై బ్యాన్… “పిశాచి 2” రిలీజ్ కు అడ్డంకులు

Pisasu 2 : ఆండ్రియా ఒంటిపై నూలు పోగు లేకుండా నటించిన హారర్ మూవీపై బ్యాన్… “పిశాచి 2” రిలీజ్ కు అడ్డంకులు
Advertisement

Pisasu 2 : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించిన తాజా హర్రర్ మూవీ ‘పిశాచి 2’ (Pisasu 2). ఈ సినిమాలో హీరోయిన్ ఆండ్రియా (Andrea Jeremiah) దుస్తులు లేకుండా నటించింది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హర్రర్ మూవీ లవర్స్ ఈ మూవీ గురించి వెయిట్ చేస్తుండగా, తాజాగా మూవీ రిలీజ్ అడ్డంకులు ఎదురయ్యాయి అన్న విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ‘పిశాచి 2’ రిలీజ్ సమస్యలో ఉంది.

2014లో డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిశాచి’ మూవీ మంచి హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ‘పిశాచి 2’ (Pisasu 2) తెరపైకి రాబోతోంది. రాక్ ఫోర్ట్ పతాకంపై మురుగానందం ఈ మూవీని నిర్మించగా. ఆండ్రియా లీడ్ రోల్ పోషించింది. అలాగే విజయ్ సేతుపతి ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ‘పిశాచి 2’ విడుదలకు బ్రేకులు పడడం గమనార్హం. ఈ మూవీ రిలీజ్ ను ఆపాలంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ అనే కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చకు దారి తీసింది.

Advertisement

తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్ ఫోర్ట్ దానికి సంబంధించిన డీల్ ప్రకారం తమకు 4.85 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్ ఫోర్ట్ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించాకే ‘పిశాచి 2’ (Pisasu 2) సినిమాను రిలీజ్ చేసుకోవాలని ఆదేశించింది. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి డబ్బులు చెల్లించే దాకా ‘పిశాచి 2’ మూవీని బ్యాన్ చేయాలని కోర్టు తెలిపింది. న్యాయమూర్తి జీకే ఎలండ్రైయన్ ఎదుట ఈ కేసు విచారణకు రాగా, నవంబర్ 18 వరకు వాయిదా పడింది. అంతలోపు రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ దీని గురించి రియాక్ట్ అవ్వాలని కోర్టు ఆదేశించింది.

కాగా ఈ మూవీలో ఆండ్రియా (Andrea Jeremiah) ఒంటిపై నూలు పోగు లేకుండా నటించింది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై డైరెక్టర్ మిస్కిన్ స్పందిస్తూ నిజంగానే ఆండ్రియా అలా నటించిందని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఇలాంటి రోల్ చేయడానికి భారీ పారితోషకం డిమాండ్ చేయడం కూడా సహజమేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆమె అలా నటించిన సన్నివేశాలను తాము షూట్ చేయలేదని, కేవలం ఫోటోలు మాత్రమే తీశామని పేర్కొన్నారు. అది కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫోటోగ్రాఫర్ తోనే అలాంటి ఫోటోలు తీశామని, ఆ సమయంలో తాను కూడా అక్కడ లేనని డైరెక్టర్ మిస్కిన్ చెప్పుకొచ్చారు. కానీ సినిమాను చిన్నపిల్లలు కూడా చూడాలనే ఉద్దేశంతో ఆండ్రియా ఫోటోలను సినిమాలో వాడలేదని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతల గొడవల వల్ల ‘పిశాచి 2’ (Pisasu 2) మూవీ రిలీజ్ కు బ్రేకులు పడడం గమనార్హం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×