BigTV English

KTR Letter to Rahul Gandhi: దమ్ముంటే హైదరాబాద్ లో ఆ ఒక్క పని చేయండి.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేటీఆర్

KTR Letter to Rahul Gandhi: దమ్ముంటే హైదరాబాద్ లో ఆ ఒక్క పని చేయండి.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేటీఆర్

KTR Letter to Rahul Gandhi: రాహుల్ జీ.. మీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. రైతులు భాదలు పడుతున్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణను అవినీతి తెలంగాణ చేశారు. వీటికి సమాధానం చెప్పండి. ముందుగా తెలంగాణ ప్రజలకు మీరు మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. ఇది మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాసిన లేఖ సారాంశం.


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం తనదైన శైలిలో రాహుల్ కు విమర్శనాస్త్రాలు సంధించింది. రేపు రాహుల్ పర్యటన ఉండగా, మాజీ మంత్రి కేటీఆర్ అనూహ్యంగా లేఖ రాశారు.

ఇంతకు కేటీఆర్ రాసిన లేఖలో ఏముందంటే.. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోనుండగా, ఏడాదిలోనే పదేళ్ల విధ్వంసం జరిగిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడెందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అంటూ ఎన్నికల వేళ రాహుల్ హామీ ఇచ్చారు కానీ .. వాటిని అమలు మరిచారు. అందుకు ముందుగా తెలంగాణ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.


ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, మీ ప్రభుత్వ వైఫల్యాల చిత్రగుప్తుడి చిట్టా అంతా తన దగ్గర ఉన్నట్లు తెలిపారు. మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, రాహుల్ గాంధీకి దమ్ముంటే హైడ్రా, మూసీ బాధితులకు వద్దకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. మీ చేతగాని పాలనతో రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల ఇబ్బందులు పడ్డారని, పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రికి ఎందుకు అండగా ఉన్నారని ఘాటుగా కేటీఆర్ ప్రశ్నించారు.

మీ అనుమతితోనే అదానీతో దోస్తీ, మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారు, మీరు ఎలా అనుమతి ఇచ్చారంటూ లేఖ ద్వారా కేటీఆర్ తెలిపారు. అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చారని, తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారం కోసం హమీలిచ్చి సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ తరపున రాహుల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

Also Read: Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

కేటీఆర్ లేఖ రాసిన తీరుపై కాంగ్రెస్ భగ్గుమంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, రుణమాఫీ, జాబ్ క్యాలండర్, డీఎస్సీ నోటిఫికేషన్, సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యూనివర్శిటీ ఇలా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, వీటి గురించి కేటీఆర్ లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ది నిరోధకులుగా ఉన్న కేటీఆర్ ని మించిన నాయకుడు లేడంటూ కాంగ్రెస్ నాయకులు రిప్లై ఇస్తున్నారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×