BigTV English

Monalisa: గుర్తుపట్టలేనంతగా మారిన మోనాలిసా.. అంతా బాలీవుడ్ మహిమ..వీడియో వైరల్..!

Monalisa: గుర్తుపట్టలేనంతగా మారిన మోనాలిసా.. అంతా బాలీవుడ్ మహిమ..వీడియో వైరల్..!

Monalisa: మోనాలిసా (Monalisa) .. మహాకుంభమేళ జరగనంత వరకూ అసలు ఈమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారిగా మహాకుంభ మేళాలో పూసల అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకెళితే, 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభ మేళ.. ప్రయాగరాజ్ లో చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే . ఈ మహా కుంభమేళాలో స్నానం ఆచరించడానికి కోట్ల మంది ప్రజలు దేశ విదేశాల నుండి వచ్చి ఇక్కడ వాలిపోయారు. తమ కోరికలను కోరుకున్నారు. అంతేకాదు పుణ్యస్నానం త్రివేణి సంగమంలో ఆచరించి పాపాలు కడిగేసుకున్నారు. మరోవైపు ఈ మహాకుంభమేళా ద్వారా చిన్నచిన్న వ్యాపారులు కూడా కోటీశ్వరులు అయిన విషయం తెలిసిందే.


ఒక ఫోటోతో భారీ పాపులారిటీ..

ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం , బ్రతుకుతెరువు చూసుకోవడానికి పూసలమ్ముకుంటూ మహా కుంభమేళాకి వచ్చిన మోనాలిసా ఒక వ్యక్తిని ఆకర్షించింది. అంతే ఆమె ఫోటోని తీసుకొని నెట్టింట షేర్ చేశాడు ఆ వ్యక్తి. దీంతో మోనాలిసా క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆమె చూడడానికి పెద్దగా ఏం అంత అందంగా లేకపోయినా.. ఆకర్షించే ఆమె కళ్ళు అందరిని మరింత ఆకట్టుకున్నాయి. దీంతో మహాకుంభమేళాకు వెళ్ళిన చాలా మంది ఈమెతో ఫోటోలు దిగాలని తెగ ప్రయత్నాలు చేశారు. ఇక దాంతో తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందని ఆమెను తీసుకొని వెనుతిరికి వెళ్లిపోయారు ఆమె తండ్రి. ఇకపోతే ఆమెకు వచ్చిన పాపులారిటీ ని క్యాష్ చేసుకోవడానికి ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు తన సినిమాలో అవకాశం కల్పించారు.. అంతేకాదు దగ్గరుండి మరి నటనలో శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు. కానీ అంతలోనే ఆయన లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.


గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మోనాలిసా..

దాంతో మోనాలిసా మొదటి సినిమా అవకాశం కూడా గంగ పాలు అయింది. ఇకపోతే సినిమాలో అవకాశం పోతేనేమి, ఆమెకు మాత్రం పలువురు జ్యూవెలరీ షాప్ యజమానులు ఓపెనింగ్ కి పిలుస్తూ ఆమె చేత తమ షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. అందులో భాగంగానే సౌత్ ఇండియాలోని ప్రత్యేక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది.ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకప్పుడు చేతుల్లో పూసలు పట్టుకొని పిచ్చిదానిలా కనిపించిన మోనాలిసా ఇప్పుడు రాజసం ఉట్టిపడేలా రెడ్ కలర్ పట్టు వస్త్రాలలో పూర్తిగా మేకప్ ధరించి గుర్తుపట్టలేనంతగా మారిపోయిందే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న మోనాలిసా ఫోటోలు చూస్తే మాత్రం.. ఇక్కడున్నది నిజంగా మోనాలిసా నేనా.? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఆవిడను స్టార్ సెలబ్రిటీ చేసేసింది బాలీవుడ్. మొత్తానికైతే మోనాలిసా ను గుర్తుపట్టలేనంతగా మార్చేసి, ఆమె కంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసింది బాలీవుడ్. దీంతో మొత్తం మహిమ బాలీవుడ్ దే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మోనాలిసా అదృష్టం మామూలుగా లేదని , మరి ఈ అందం చూసిన దర్శక నిర్మాతలు ఈమెకు తమ సినిమాల్లో అవకాశం కల్పిస్తారేమో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×