BigTV English

Sharmila House Arrest: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్..

Sharmila House Arrest: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్..

Sharmila House Arrest: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయుని పాలెంలో ఇవాళ షర్మిలా పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు పెట్టారు. గన్నవరం మండలం కేసరపల్లిలో గృహనిర్బంధం చేశారు. షర్మిలను హౌస్ అరెస్ట్ చేసి, ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో PCC చీఫ్ పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారు. షర్మిలా పర్యటన నేపధ్యంలో పోలీసుల ఆంక్షలు విధించారు. ఆమె తన నివాసం నుంచి బయటకు రాకుండా బారికేడ్లు పెట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు పెట్టారు.


హౌస్ అరెస్టుపై వైఎస్ షర్మిలా తన ఎక్స్ వేధికగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది చెప్పాలని ప్రశ్నించారు. విజయవాడలోని తన ఇంట్లో హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తనను ఎందుకు అరెస్ట్ చేశారో గల కారణాలు కూడా.. ఏపీ ప్రజలకు తెలియజెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక తన సొంత పని మీద ఏపీ పీసీసీ కార్యాలయానికి వెళుతున్న.. తనను అడ్డుకోవడం నేరం కాదా అని ప్రశ్నించారు. ఇక తమ రాజ్యాంగం హక్కులను కాలరాయాలని చూస్తున్నారా అంటూ.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేధికగా రాసుకొచ్చారు.

హౌజ్ అరెస్ట్ పై వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా స్పందించారు. నన్ను ఎందుకు ఆరెస్ట్ చేశారని, ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని పై రిసెర్చ్ కోసం అమరావతి క్యాపిటల్ కమిటి కాంగ్రెస్ పార్టీ తరపున వేశాం , కమిటి తరపున అమరావతి విజిట్ చేయాలని అనుకున్నాం. మేము కమిటి వేస్తే మీకు ఎందుకు భయం అని ప్రశ్నించారు ఆమె. ఇక ప్రొటెస్ట్ చేయాలనుకుంటే చంపేస్తారా.. ధర్నాలు, ప్రొటెస్ట్‌లు చేసే హక్కు లేదా అని అడిగారు. పోలీస్ వ్యవస్థను దేనికి వాడుతున్నారని నిలదీశారు. మీరు నియంతలు కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నా ఇంటి ముందు అంత మంది పోలీసులు ఎందుకు ఉంచారు. పోలీసులు తన పై చెయ్యి వేశారు, ఇదేనా మహిళలతో వ్యవహరించే పద్దతి.. రాష్ట్రం మహిళలపై అత్యాచారాల్లో మూడో స్థానంలో ఉంది.. ఇలాంటి వాటపై ఫోకస్ చేయాలన్నారు.


మరోవైపు.. మే 2న జరిగే ప్రధాని మోడీ సభకోసం అమరావతి ముస్తాబవుతోంది. ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అధికారులు.. రాజధాని గ్రామాల్లో రహదారులు బాగు చేస్తున్నారు. ప్రజలు వేదిక వద్దకు చేరుకునే మార్గాలను సిద్ధమవుతున్నాయి. దాదాపు 90శాతం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం పనులను పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read: సింహాచలం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల‌ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

ఇదిలా ఉంటే.. షర్మిలపై ప్రధాని మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మోదీపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారతదేశం నిఘా వ్యవస్థలపైనా, దేశ ప్రధాని మోదీని ఉద్దేశించి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×