BigTV English

Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా.. అప్పుడే టార్చర్ మొదలైందా ?

Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా.. అప్పుడే టార్చర్ మొదలైందా ?
Mahesh Babu

Mahesh Babu : అంతకుముందు టాలీవుడ్ లో సూపర్ స్టార్ అంటే సంవత్సరానికి నాలుగు ఐదు సినిమాలు చేసేవాళ్ళు. క్రమంగా అది తగ్గుతూ వచ్చి ప్రస్తుతానికి రెండు మూడు సంవత్సరాలకి ఒక సినిమా చేస్తే ఎక్కువ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సూపర్ సార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట వచ్చి ఇప్పటికే సంవత్సరం పైన గడుస్తోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి అతను ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం చిత్రం విడుదల కాబోతోంది. తర్వాత అయినా వెంటనే నెక్స్ట్ మూవీ ఉంటుందా అంటే.. అది మాత్రం డౌటే అంటున్నారు సినీ విశ్లేషకులు.


మహేష్ బాబు నెక్స్ట్ చేయబోయే చిత్రం దర్శక ధీరుడు రాజమౌళితో.. కాబట్టి వీళ్ళిద్దరి కాంబోపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి అప్పుడే మహేష్ బాబుకి కొన్ని కండిషన్స్ పెట్టేసాడు అని ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జక్కన్న, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే చిత్రం స్టోరీ లైన్ పై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి ఒక మాట చెబుతుంటే స్టోరీ రాసే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరొక మాట అంటున్నాడు. ఇంతకీ సినిమాకి అసలు కథ ఏంటి అన్న విషయం ఇంకా ఎవరికీ క్లారిటీగా తెలియదు.

ఆ విషయం పక్కన పెడితే ఈ విషయంలో మహేష్ బాబు కి రాజమౌళి ఓ రేంజ్ లో చుక్కలు చూపిస్తున్నాడని టాక్. రాజమౌళి డైరెక్షన్లో ఒక హీరో సినిమా చేస్తున్నాడు అంటే.. అది ఏ రేంజ్ టార్చర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆఫ్ ది రికార్డ్ ఇంతకుముందు రాజమౌళితో నటించిన ఎందరో హీరోలు తమ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో వివరించి ఉన్నారు. రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ,రామ్ చరణ్, రానా.. ఇలా అందరూ రాజమౌళితో సినిమా ఓకే అయితే ఎలా ఉంటుందో చాలా సార్లు ప్రస్తావించారు కూడా.


మహేష్ బాబు కి రాజమౌళి టార్చర్ అప్పుడే మొదలైంది అని పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎప్పుడో మొదలయ్యే సినిమా కోసం ఇప్పటి నుంచే జక్కన్న మహేష్ చేత ప్రత్యేకమైన డైట్ ఫాలో చేస్తున్నారట. దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త న్యూట్రిషన్ కూడా మహేష్ బాబు కోసం అపాయింట్ చేసినట్టు తెలుస్తుంది. న్యూట్రిషన్ వచ్చినా పెద్దగా ఇబ్బంది పడడం లేదట. రోజుకు ఎనిమిది గంటలు జిమ్ చేస్తూ ఆహారంలో కఠినమైన డైట్ ఫాలో అవ్వడం మహేష్ బాబుకు పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు నెటిజన్స్. అయితే ప్రస్తుతం గుంటూరు మూవీకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్న మహేష్..ఈ డైట్ ఫాలో అవ్వడం కాస్త కఠినంగానే ఉంది అని సన్నిహిత వర్గాల టాక్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×