Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా మరో సినిమా అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రతి ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించే ప్రిన్స్ మహేష్ ఇప్పటివరకు కొత్త సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా రావడానికి రెండు, మూడేళ్లు తీసుకుంటుంది. ఇక ఈ సినిమా కూడా అంతే టైం పట్టొచ్చు. ఈ కాంబోలో మూవీని అనౌన్స్ చేసి దాదాపు రెండేళ్లు అయిన కూడా ఇంక సెట్స్ మీదకు వెళ్లలేదు.. ఈ సినిమా అప్డేట్ ఏమో గానీ మహేష్ సినిమాకు గ్యాప్ దొరకడంతో ఫ్యామితో ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ట్రిప్ కు వెళ్లారు. ఆ సమయంలో ఆయన వేసుకున్న బ్యాగ్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మహేష్ బాబు తాజాగా ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబుకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలలో మహేష్ బాబు ప్రత్యేకమైన బ్యాగ్ ను ధరించారు.. ఆ ఫోటోలలో బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బ్యాగ్ ఖరీదు తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ బ్యాగ్ ఖరీదు ఏకంగా 3,81,841 రూపాయలు కావడం గమనార్హం. లగ్జరియస్ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎం.ఎం బ్యాక్ ప్యాక్ ను మహేష్ బాబు ధరించారు. మహేష్ బాబు నమ్రతతో కలిసి ఏ దేశానికి వెళ్లాడనే చర్చ జరుగుతోంది. అలాగే మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2025 సంవత్సరం జనవరిలోనే మొదలుకానుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది..
ఇక ఈ సినిమా షూటింగ్ 2025 సంక్రాంతి తర్వాత మొదలు పెట్టనున్నారని సమాచారం.. సమ్మర్ కల్లా హాఫ్ పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్.. ఈలోపు సైన్ చేసిన కమర్షియల్ పనులన్ని పూర్తి చేసేసుకుంటున్నాడు మహేష్. దీంతోపాటే ఫ్యాన్స్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట సూపర్ స్టార్. రాజమౌళి సినిమా సెట్స్ పైకి రాకముందే ఫ్యామిలీ టైం ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. హాలిడేస్ కు వెళ్తూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒకసారి రాజమౌళి మూవీ షూట్ మొదలైతే.. అందులోంచి బయటకు రావడం అసాధ్యం. పైగా మూడేళ్ల తర్వాత కానీ తన నుంచి సినిమా ఆడియన్స్ కు రాదు. అందుకే ఫ్యాన్స్ ని కలిసి సలహాలు సూచనలు తీసుకుంటున్నాడట. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.