E-Paper
Advertisement

Mahesh Babu:- SSMB 28 టైటిల్‌.. సెంటిమెంట్‌ను వ‌ద‌ల‌ని గురూజీ

Mahesh Babu:- SSMB 28 టైటిల్‌.. సెంటిమెంట్‌ను వ‌ద‌ల‌ని గురూజీ
Advertisement

Mahesh Babu:- టాలీవుడ్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ ఒక‌టి. జ‌న‌వ‌రి మూడో వారంలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, హీరో మ‌హేష్ ఎలాంటి టెన్ష‌న్ లేకుండా సినిమాను కంప్లీట్ చేయ‌టానికి రెడీ అయ్యారు. అందుకు కార‌ణం SSMB 28 సినిమాను ఆగ‌స్ట్‌లో రిలీజ్ చేయ‌టం లేద‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేదు. దీనిపై సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు. ఉగాదికి మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ ఇస్తారేమోన‌ని అంద‌రూ భావించారు. కానీ.. ఎలాంటి స‌ర్‌ప్రైజ్ రాలేదు.

అయితే SSMB 28కి సంబంధించిన స‌ర్‌ప్రైజ్‌ను శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా మార్చి 29న ఇవ్వ‌బోతున్నార‌ట‌. అంటే SSMB 28 టైటిల్‌ను అధికారికంగా అనౌన్స్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు ర‌కాలైన టైటిల్ నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తాజాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు SSMB 28కి త్రివిక్ర‌మ్ ..‘అమరావతికి అటు ఇటుగా..’ అనే టైటిల్‌ను పెడుతున్నార‌ట‌. టైటిల్ వింటుంటే కూల్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎట్రాక్ట్ అయ్యేలా ఉందిగా. గురూజీ ఎప్ప‌టిలాగానే ఫ్యాన్స్ స‌హా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా SSMB 28ను రూపొందిస్తున్నార‌ట‌.

Advertisement

అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ (చిన‌బాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల‌లో విడుద‌ల చేయాల‌ని ముందుగా భావించారు కానీ.. మహేష్ తండ్రి కృష్ణ, ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోవటంతో షెడ్యూల్స్ వాయిదాలు పడ్డాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. రీసెంట్‌గా ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నామని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. కానీ ఇప్పుడా డేట్ కూడా లేదు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికే అంటున్నారు మ‌రి. టైటిల్ అనౌన్స్మెంట్‌తో పాటు రిలీజ్ డేట్‌పై కూడా ద‌ర్శ‌క నిర్మాత‌లు క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ సినిమా కోసం మ‌హేష్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సిక్స్ ప్యాక్ లుక్‌లో ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు.

చిన్న‌వాడైన హీరోతో న‌టి మీనా రెండో పెళ్లి.. షాకింగ్ కామెంట్స్ చేసిన న‌టుడు

Advertisement

for more updates follow this link:-bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×