Big Stories

Solar System:-సోలార్ సిస్టమ్‌లో నాలుగు అగ్నిపర్వతాలు..

Solar System:- అగ్నిపర్వతం అనేది ఒక్కసారిగా తనలోని వేడిని అంతా బయటికి పంపేసి.. ఆ ప్రాంతం మొత్తాన్ని దహించుకుపోతుంది. అందుకే అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తూ ఉంటారు. తాజాగా కేవలం భూగ్రహంలోనే కాదు.. ఇతర గ్రహాల్లో కూడా అగ్నిపర్వత విస్ఫూటక ప్రమాదాలు జరుగుతాయని బయటికి వచ్చిన వార్త సంచలాన్ని సృష్టించింది. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరించారు.

- Advertisement -

తాజాగా వీనస్‌లో అగ్నిపర్వతం బద్దలయ్యింది అనడానికి ఆధారాలను చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. వీనస్ అనేది భూగ్రహానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉంటుంది. అక్కడ అగ్నిపర్వతం ఉండడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు చేసిన తర్వాత అప్పుడప్పుడు భూమిపైనే కాకుండా పలు గ్రహాల్లో వాల్కనిజం అనేది కనిపించడం సహజం అంటున్నారు. సోలార్ సిస్టమ్‌లో ఉన్న మరో నాలుగు ప్రాంతాల్లో కూడా యాక్టివ్‌గా వాల్కనో ప్రమాదంలో ఉంటాయని వారు బయటపెట్టారు.

- Advertisement -

మార్స్‌లో కూడా యాక్టివ్ వాల్కనోలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పటివరకు అక్కడ అగ్నిపర్వతం ఉన్నట్టు నేరుగా ఆధారాలు దొరకకపోయినా.. మార్స్ నేలపై వాల్కనో ఉంటుందని మాత్రం వారు నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా సోలార్ సిస్టమ్‌లోనే అతిపెద్ద వాల్కనో.. ఒలింపస్ మాన్స్ అనేది మార్స్‌లోనే ఉన్నట్టుగా వారు గుర్తించారు. ఒలింపస్ అనేది మార్స్ నేలకు దాదాపు 26 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందని అంచనా. అంతే కాకుండా ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే డబుల్ ఎత్తులో ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సెరెస్ అనేది సోలార్ సిస్టమ్‌లో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్‌లోనే అతిపెద్దది. సూర్యుడితో పాటు ఇతర గ్రహాలు తిరుగుతున్న ఆర్బిట్‌కు సెరెస్ అనేది కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహూనా మాన్స్ అనే వాల్కనోను 2015లో సెరెస్‌పై నాసా కనిపెట్టింది. దీంతో పాటు ఐఓలో కూడా ఒక వాల్కనోను వారు కనిపెట్టారు. ఐఓ అనేది జూపిటర్‌లోని ఇన్నర్ భాగం. 43 గంటలకు ఒకసారి ఇది జూపిటర్ ఆర్బిట్‌లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే.. ఐఓలోనే ఎక్కువగా వాల్కనో ఆనవాళ్లు కనిపించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అతిచిన్న గ్రహం అయిన ప్లూటోకు కూడా వాల్కనో ప్రమాదం తప్పడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహంపైకి ఇప్పటివరకు ఏ దేశ ఆస్ట్రానాట్స్ కూడా వెళ్లలేకపోయారు. కానీ 2015లో నాసా ఆ సాహసం చేసింది. నాసా పంపిన మిషన్ ప్లూటో లోపలి భాగం వరకు వెళ్లగలిగింది. అక్కడే అది రైట్ మోన్స్‌ను కనిపెట్టింది. ఇది ఒక షీల్డ్ వాల్కనోగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సోలార్ సిస్టమ్‌లో ఇలాంటి వాల్కనోను కనిపెట్టడం అదే మొదటిసారని కూడా వారు అన్నారు. ఇలా సోలార్ సిస్టమ్‌లోని ఉండే యాక్టివ్ వాల్కనోలను కనిపెట్టడం ద్వారా గ్రహాల లక్షణాలను కూడా కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు.

చాట్‌బోట్స్‌కు మెడికల్ ఇంటర్వ్యూ..

for more updates follow this link:-bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News