E-Paper
Advertisement

Mahesh Babu: అనంత్ అంబానీ పెళ్లి.. గ్లోబల్ స్టార్ నే డామినేట్ చేసి పడేసాడుగా

Mahesh Babu: అనంత్ అంబానీ పెళ్లి..  గ్లోబల్ స్టార్ నే డామినేట్ చేసి పడేసాడుగా
Advertisement

Mahesh Babu: అంబానీ ఇంట పెళ్లి అనగానే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వచ్చే ప్రముఖులతో కళకళలాడుతూనే ఉంటుంది ఇక ఈసారి కూడా అనంత్ అంబానీ పెళ్ళిలో కూడా అదే జరిగింది. ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీలు మొత్తం ఈ పెళ్లిలోనే కనిపించారు. గత రాత్రి ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

బాలీవుడ్ హీరోలందరూ పెళ్ళిలో మెరిశారు. ఇక హాలీవుడ్, టాలీవుడ్ నుంచి అతి కొంద్దిమంది ప్రముఖులు మాత్రం సందడి చేశారు. ఇక మొదటి నుంచి ఈ వివాహానికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కడే అటెండ్ అవుతున్నారు అని అనుకున్నారు. తీరాచూస్తే టాలీవుడ్ హీరోలు పలువురు పెళ్ళిలో కనిపించి సందడి చేశారు. వెంకటేష్, రానా దంపతులు, అఖిల్, చరణ్ దంపతులు హాజరయ్యారు.

Advertisement

ఇక టాలీవుడ్ మాత్రమే కాదు పెళ్ళి మొత్తానికి హైలైట్ గా మారింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ జాన్ విక్ లా మహేష్ లుక్ కు హాలీవుడ్ కూడా ఫిదా అవ్వడం ఖాయమని చెప్పాలి. బ్లూ కలర్ షేర్వాణీ, లాంగ్ హెయిర్, గడ్డంతో అద్భుతంగా కనిపించాడు. అందరూ రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఎదురుచూస్తున్న తరుణంలో మహేష్ ఎంట్రీ ఆ ఆలోచనలను పక్కకు నెట్టేసింది.

అసలు మహేష్ లుక్ గురించే సోషల్ మీడియా మొత్తం చర్చిస్తుంది. ఆ ఛార్మింగ్ లుక్.. డ్రెస్సింగ్ స్టైల్.. హాలీవుడ్ హీరోకు ఈ మాత్రం తీసిపోకుండా కనిపించాడు. ఇక చరణ్ నార్మల్ వైట్ అండ్ వైట్ కుర్తాలో సింపుల్ గా కనిపించాడు. ఈ పెళ్ళిలో కచ్చితంగా చరణ్ ను మహేష్ బాబు డామినేట్ చేశాడు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisement

ప్రస్తుతం ఈ లుక్ ను మహేష్.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29 కోసం మెయింటైన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒక్క లుక్ తో ఆ సినిమాపై అంచనాలను పెంచేశాడు మహేష్. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×