E-Paper
Advertisement

Malavika Mohanan: రాజాసాబ్ సెట్ లో హీరోయిన్ పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు వైరల్

Malavika Mohanan: రాజాసాబ్ సెట్ లో  హీరోయిన్ పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు వైరల్
Advertisement

Malavika Mohanan: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

ఇప్పటికే తంగలాన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఈ మధ్యనే మాళవిక సర్దార్ 2 లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ రెండు సినిమాలు కాకుండా మాళవిక రాజాసాబ్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

ఇప్పటివరకు మాళవిక.. రాజాసాబ్ లో నటిస్తుంది అని తెలుసు కానీ, అధికారికంగా మేకర్స్ ప్రకటించింది లేదు. ఇక ఇన్నాళ్లకు మేకర్స్ అధికారికంగా మాళవిక మోహనన్ ను రాజాసాబ్ లోకి ఆహ్వానించారు. ఇక ఈరోజు మాళవిక బర్త్ డే సందర్భంగా రాజాసాబ్ సెట్ లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సెట్ లోనే డైరెక్టర్ మారుతీ.. మాళవికతో కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కితో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు కామెడీ హర్రర్ జోనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మాళవిక టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×