E-Paper
Advertisement

Ajith Vijayan: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత..!

Ajith Vijayan: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత..!
Advertisement

Ajith Vijayan:సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ విజయన్ (Ajith Vijayan) కన్నుమూశారు. 57 ఏళ్ల వయసులో తన నివాసంలో ఆయన మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్, ప్రణయ కథ, బెంగళూరు డేస్ , అమర్ అక్బర్ ఆంథోనీ, అంజు సుందరికల్ తదితర చిత్రాలలో నటించారు. ఇక ఈయన మరణం పై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇటు తెలుగు చిత్రాలలో కూడా నటించడంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, ఆడియన్స్ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే అజిత్ విజయన్ మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు. ఈ విషయాలపై కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు స్పందించాల్సి ఉంటుంది.

అజిత్ విజయన్ సినీ బ్యాక్ గ్రౌండ్..

Advertisement

అజిత్ విజయన్ ఇండస్ట్రీలోకి రాకముందే పాపులారిటీ అందుకున్నారు. ఎందుకంటే ఈయన బడా సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఈయన ఎవరో కాదు.. ప్రఖ్యాత కథాకళి కళాకారుడు కళా మండలం కృష్ణన్ నాయర్, మోహినియాట్టం నృత్యకారిణి కళా మండలం కళ్యాణి కుట్టి అమ్మ మనవడు. ఇక ఈయన తల్లిదండ్రుల విషయానికొస్తే.. దివంగత సికే విజయన్ అలాగే మోహినియాట్టం గురువు కళా విజయన్ ల కుమారుడు. ఇండస్ట్రీ లోకి వచ్చి పలు సినిమాలలో నటించిన ఈయన అటు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఈయన భార్య ధన్య, కుమార్తెలు గాయత్రి , గౌరీ ఉన్నారు. ఇక ఈయన మామ ఎవరో కాదు దివంగత ప్రముఖ సినీ నటుడు కళాశాల బాబు. ఇక ఇలా మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈయన ఏ కారణం చేత మరణించారు అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×