IPL 2025: క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ మార్చి 21వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని బీసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా {Rajeev shukla} ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 సీజన్ (Indian Premier League 2025 Tournament) మొదటి మ్యాచ్ లో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
Also Read: Champions Trophy 2025: గ్రౌండ్ లోనే తన్నుకున్న అక్తర్, హర్భజన్ సింగ్… వీడియో వైరల్ !
కాగా ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి మరో 40 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి {బీసీసీఐ} తన రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఓ కీలక సూచన చేసింది. ఐపీఎల్ కోసం కేటాయించిన మైదానాలను.. ఇతర మ్యాచ్ లకు అందుబాటులో ఉంచకూడదని రాష్ట్ర సంఘాలను బీసీసీఐ హెచ్చరించింది. ఈ మేరకు బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
ఐపీఎల్ (Indian Premier League 2025 Tournament) మ్యాచ్ లు నిర్వహించే మైదానాలలో ఇతర లీగ్ లు జరగకుండా ఇప్పటినుంచే చూసుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. ఇతర లీగ్ లకు సంబంధించిన మ్యాచ్ లు జరిపితే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ పిచ్ లు నాశనం అవుతాయనే ఉద్దేశంలో భాగంగా బీసీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇలా ఉప్పల్, చిన్నస్వామి స్టేడియం, చెన్నై చెపాక్, ముంబైలోని ఎంసీఏ లాంటి స్టేడియాలకు ఆదేశాలు జారీ చేసింది.
అవుట్ ఫీల్డ్ ని రంజీ ట్రోఫీ నాకౌట్ గేమ్ లకు ఉపయోగించుకోవచ్చని.. కానీ లెజెండ్స్ లీగ్ క్రికెట్, ప్రైవేట్ సెలబ్రిటీ ఈవెంట్లు వంటి ఇతర లీగ్ లు నిషేధించబడతాయని బోర్డు పేర్కొంది. అలాగే అవుట్ ఫీల్డ్ శుభ్రంగా ఉండాలని బిసిసిఐ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిన ఈ మెయిల్ లో పేర్కొంది. ఐపీఎల్ 2025 (Indian Premier League 2025 Tournament) వేదికలు ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్,
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. ఆ డేంజర్ ప్లేయర్ ఔట్?
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లలో జరుగుతుంటాయి. అయితే బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఐపీఎల్ జట్లకు పెద్ద షాక్ తగిలినట్లు అయింది. గతంలో ఐపీఎల్ జట్లు వారి వారి మైదానాలలో ప్రాక్టీస్ చేసుకునేవి. కానీ బీసీసీఐ ఈసారి అందుకు అనుమతి ఇవ్వలేదు. ఇక ఐపీఎల్ 2025 (Indian Premier League 2025 Tournament) కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇప్పటికీ విడుదల కాలేదు. కానీ ప్రధాన తేదీలను మాత్రం వెల్లడించారు.