Lucky Zodiac Signs 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట వ్యవధిలో గ్రహాల సంచారము, ఇతర గ్రహాలతో వాటి కలయిక అనేక రకాల యోగాలను సృష్టిస్తుంది. గ్రహాల అరుదైన కలయిక ఏర్పడినప్పుడల్లా మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. మార్చి నెలలో ఇలాంటి అరుదైన యాదృచ్చికం జరగబోతోంది. ఆ సమయంలో మీన రాశిలో 6 గ్రహాల కలయిక జరగనుంది. రాహువు, శుక్రుడు, శని, బుధుడు, సూర్యుడు, చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నారు.
మార్చి నెలలో రాహువు , శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తారు. అంతే కాకుండా మార్చి 29న శని, మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కూడా ఇప్పటికే మీనరాశిలో ఉంటాడు. కాబట్టి మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్చి 28న చంద్రుడు మీనరాశిలో ఉంటాడు. ఈ విధంగా మార్చి 29న 6 ప్రధాన గ్రహాలు మీన రాశిలో కలిసి ఉంటాయి. ఈ 6 గ్రహాల అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి శుభ సంకేతం. ఈ అరుదైన యాదృచ్చిక కలయికలో ఏ రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
మిథున రాశి వారికి మార్చి నెలలో 6 గ్రహాల అరుదైన కలయిక చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా ఈ 6 గ్రహాల అరుదైన కలయిక మీ జాతకంలోని పదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ ఇల్లు వృత్తి , వ్యాపారానికి సంబంధించినది. కాబట్టి మిథున రాశి వారికి వ్యాపారంలో అపారమైన లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ కృషి తగినంతగా మద్దతు పొందుతారు. దీని కారణంగా వారు కొత్త శిఖరాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి వారి ఆఫీసుల్లో కూడా పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యంలో గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది, . మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది.
Also Read: బుధుడి సంచారం.. ఫిబ్రవరి 27 నుండి వీరికి కష్టాలు తప్పవు
కన్యా రాశి:
కన్యా రాశి వారికి మీన రాశిలో 6 గ్రహాల అరుదైన కలయిక మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాకుండా మీ రాశి ఇంటి నుండి ఏడవ ఇంట్లో ఈ కలయిక జరగనుంది. ఈ అరుదైన కలయిక మీకు మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని తెచ్చి పెడుతుంది. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీరు లాభాలను పొందుతారు. అంతే కాకుండా విద్యా పరంగా మీరు శుభ వార్తలు అందుకుంటారు. కొత్త వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీరు చేసే పనులకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది.