BigTV English
Advertisement

Beena Antony-Siddique: సిద్దిక్‌ని కౌగిలించుకున్న సీరియల్ నటి.. మహిళలను వేధించేవాడికి హగ్గులేంటీ? వీడియో వైరల్

Beena Antony-Siddique: సిద్దిక్‌ని కౌగిలించుకున్న సీరియల్ నటి.. మహిళలను వేధించేవాడికి హగ్గులేంటీ? వీడియో వైరల్

Malayalam Actress Beena Antony-Siddique Viral Video: మాలీవుడ్ ఇండస్ట్రీలో హేమా కమిటీ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు మహిళా నటుల లైంగిక వేధింపులపై ఆరోపణలతో మాలీవుడ్ లో సీన్ సితారవుతుంది. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీని వణికిస్తోంది. అప్పడెప్పుడో పదేళ్ల క్రితం హీరోయిన్ భావనకు కేరళలో ఎదురైన ఘటనతో అప్పుడు హేమా కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ హేమా కమిటీ ఈ మధ్యే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టడంతో రోజుకొకరు చొప్పున నటీమణులు బయటకు వచ్చి తమకు గతంలో ఎదురైన సంఘటనలను చెబుతూ ఉండటంతో ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.


అయితే ఈ నేపథ్యంలో అమ్మా మాజీ సెక్రటరీగా ఉన్న నటుడు సిద్ధిక్.. నటి బీనా ఆంథోనీని కౌగిలించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నటి బీనా కౌగిలించుకుంటోదని ఆమెపై విమర్శలు వెలువెత్తాయి. అయితే ఈ విమర్శలపై స్పష్టతనిస్తూ.. నటి బీనా ఆగష్టు 29న ఒక పోస్ట్ చేసింది. జూన్‌లో సిద్ధిక్ 37 ఏళ్ల కుమారుడు మరణించిన వెంటనే జరిగిన అమ్మ సమావేశంలో వీడియో తీశారని ఆమె వెల్లడించింది. కుమారుడి మరణంతో దుఖంలో ఉన్న సిద్దిక్ ని ఓదార్పుగా కౌగిలించుకున్నానని తెలిపింది. నటుడు సిద్దిక్ తనను ఎప్పుడు సోదరిలా చూసేవారని, ఆయన కుమారుడు తన ఎదుటే పెరిగాడని నటి బీనా వివరించింది. ఈ వీడియోను అనుసరించి సిద్ధిక్‌తో తనకున్న సంబంధాన్ని ప్రశ్నిస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు.

Also Read: హేమ కమిటీ నివేదికపై సమంత స్పందన ఇదే..


మలయాళ సీనియర్ నటుడు సిద్ధిక్‌పై అత్యాచారం ఆరోపణలపై యువ నటి ఫిర్యాదు చేయడంతో తిరువనంతపురంలోని మ్యూజియం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువ నటి చేసిన ఆరోపణల నేపథ్యంలో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిక్ రాజీనామా చేశారు. కేవలం తనపై కుట్ర చేసేందుకే మహిళా నటి ఆరోపణలు చేసిందని పేర్కొంటూ సిద్ధిక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక, ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కొంతమంది సభ్యులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సోమవారం నటుడు మోహన్‌లాల్ మలయాళ సినీ కళాకారుల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×