E-Paper
Advertisement

Samantha: హేమ కమిటీ నివేదికపై సమంత స్పందన ఇదే..

Samantha: హేమ కమిటీ నివేదికపై సమంత స్పందన ఇదే..
Advertisement

Tollywood actress Samantha reacted on Hema committee report: సమంత నటిగానే కాదు సామాజిక సేవలోనూ ముందుంటుంది. కాకపోతే తాను చేసే సేవా కార్యక్రమాలను గుట్టుగా చేస్తారు. ఆర్భాటపు ప్రచారాల జోలికి వెళ్లరు. తన వ్యక్తిగత సంపాదనలో 60 శాతం అనాథాశ్రమాలు నడిపిస్తున్న సంస్థలకు విరాళం ఇస్తున్నారు. దాదాపు 150 కోట్లు సంపాదనలో టాప్ రేంజ్ లో ఉన్న సమంత ఇప్పటికీ ఐదు నుంచి ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నయనతార తర్వాత అత్యంత పారితోషికం డిమాండ్ చేసే హీరోయిన్ గా సమంత పేరు తెచ్చుకున్నారు.

సమంత సంయమనం

Advertisement

గత కొంత కాలంగా వ్యక్తిగతంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్న సమంతను ఏదో ఒకరకంగా మీడియా వారు వార్తలలోకి ఎక్కిస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన శోభిత, చైతూల నిశ్చితార్థం వ్యవహారంపై సమంత సంయమనం పాటిస్తూ వస్తున్నారు. సమంత భవిష్యత్ ఏమిటి? ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుని చైతూకు బుద్ధి చెబుతుందా? ఆమెకు ఎవరెవరో దర్శకులతో పరిచయాలున్నాయని.. వారితో ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. అన్నింటినీ ప్రశాంతంగా భరిస్తూ తన పని తాను చేసుకుపోతున్నారు సమంత. అయితే ఇటీవల మలయాళ పరిశ్రమలో తీవ్ర సంచలనం కలిగిస్తున్న మీటూ.. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సమంత స్పందించారు. ఇది శుభపరిణామం అని సమంత అన్నారు.  సినిమా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని హేమ కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదికలో చాలా కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Also Read:  అసలు ఈ హేమ కమిటీ అంటే ఏంటి.. ఇండస్ట్రీలో ఉన్న కీచకులు ఎవరు?

Advertisement

హేమ కమిటీపై సమంత స్పందన

ఇన్నాళ్లూ కేరళ సినీపరిశ్రమకు చెందిన పెద్దలకు భయపడి నోరు విప్పని ఎందరో తారలు ఇప్పుడిప్పుడే తమకు జరిగిన అన్యాయంపై స్పందిస్తున్నారు. కేరళ తరహాలోనే ఇప్పుడు ఉన్న అన్ని సినిమా పరిశ్రమలలోనూ ఇలాంటి తరహా కమిటీ వేయాలని ఒత్తిడులు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి సమంత రీసెంట్ గా మలయాళ పరిశ్రమ నియమించిన హేమ కమిటీ నివేదికపై స్పందించారు. కమిటీ తీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కమిటీ నివేదిక ద్వారా ఇకపై మలయాళ నటీమణులు భయపడనక్కర్లేదని వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఈ విషయంలో అద్భుతంగా పనిచేస్తోందని.. అక్కడి మహిళా నటీమణులకు పూర్తి స్థాయి భరోసా ఇస్తోందని అన్నారు. వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చేసిన కృషివలనే హేమ కమిటీ ఏర్పాటయిందని.. దీనితో సినిమా పరిశ్రమలో ఎప్పటినుంచో వస్తున్న లైంగిక వేధింపులకు చెక్ పడినట్లయిందని అన్నారు. హేమ కమిటీ నివేదికలో ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో మలయాళ పరిశ్రమ సినీ పెద్దలు షాక్ కు గురవుతున్నారని.. ఇది ఊహించని పరిణామం అని ఆమె అన్నారు.

ఇకనైనా కఠిన చట్టాలు రావాలి

ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ అధ్యక్ష పదవికి సినీ హీరో మోహన్ లాల్ తన రాజీనామాను సమర్పించారు. అలాగే అమ్మా కమిటీలో మరికొందరు సభ్యులపైనా వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో వారు కూడా రాజీనామాలు సమర్పించడంతో అమ్మా చిత్ర మండలి రద్దయింది. మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన పెను తుఫాను ఇప్పుడు అటు కోలీవుడ్, శాండల్ వుడ్ లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే కుష్బూ, సమంత లాంటి తారలు హేమ కమిటీ నివేదికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇకనైనా అక్కడి ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఇకపై జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×