BigTV English

Legends League Auction: లెజండ్స్ లీగ్ లో.. దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్

Legends League Auction: లెజండ్స్ లీగ్ లో.. దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్
Legends League Cricket 2024 Auction Highlights: సీనియర్ క్రికెటర్లకు స్వర్గధామంలా లెజండ్స్ క్రికెట్ లీగ్ మారింది. ఆర్థికంగా వెనుకపడిన వారికి భరోసాగా నిలుస్తోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో పలువురు లెజండ్రీ క్రెకటర్లకి లక్షల రూపాయల్లో ధర పలికింది. ఇప్పటికి ఫిట్ గా ఉండి, ప్రాక్టీస్ చేస్తూ టచ్ లో ఉన్నవాళ్లని ఎంపిక చేసుకున్నారు.

మొత్తానికి లెజండ్స్ క్రికెట్ లీగ్ లోకి శిఖర్ ధావన్ తో పాటు దినేశ్ కార్తీక్ కూడా వెళ్లడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  మాజీ స్టార్ క్రికెటర్లు వెళ్లడంతో లెజండ్స్ లీగ్ పై అంచనాలు పెరిగాయి. దీంతో జనాల్లో ఆసక్తి కూడా పెరిగింది. అయితే వీరిద్దరిని ఎంతకి కొనుగోలు చేశారనేది తెలీదు. అయితే 2024 సెప్టెంబరు 20 నుంచి లెజండ్స్ లీగ్ ప్రారంభం కానుంది.


ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. అందులో సదరన్ సూపర్ స్టార్ట్స్ జట్టుకి దినేష్ కార్తీక్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇకపోతే భారత్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఎంతో మంది లెజండ్స్ లీగ్ లో ఆడటం విశేషం. ఆనాటి లెజండరీ క్రికెటర్లు మళ్లీ గ్రౌండులో సత్తా చాటితే చూడాలని ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.

లెజండ్ లీగ్స్ లో పాల్గొనే జట్ల పేర్లు ఏమిటంటే.. సౌత్ సూపర్ స్టార్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్. మరికొద్ది రోజుల్లో ఇంకొంతమంది మాజీ స్టార్ క్రికెటర్లు ఆడనున్నారని అంటున్నారు.


Also Read: 26 ఏళ్లకే.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ఈ సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ లెజండ్స్ లీగ్ లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. ఇంకా తనలో క్రికెట్ ఆడే సత్తా ఉందని అన్నాడు. మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

ఏదైనా మాలాంటి వాళ్లకు.. క్రికెట్ ఆడటంలోనే ఆనందం ఉందని అన్నాడు. అదే మా ఊపిరి, అదే మా జీవితం, అదే మా సర్వస్వమని తెలిపాడు. శరీరం సహకరించే వరకు ఆడేందుకే ఇష్టపడతానని అన్నాడు. అయితే ఇన్నాళ్లూ నన్ను అభిమానించిన, ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలని తెలిపాడు. మళ్లీ మిమ్మల్ని అలరించేందుకు మైదానంలో అడుగుపెడుతున్నట్టు తెలిపాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×