E-Paper
Advertisement

Manjummel Boys OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Manjummel Boys OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Advertisement

Manjummel Boys OTT: ఈ మధ్య మలయాళం మూవీలు ఒకదాని తర్వాత మరొకటి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. అందులో మంజుమ్మల్ బాయ్స్ మూవీ ఒకటి. ఈ మూవీ మలయాళంలో ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫస్ట్ షో నుంచి తన హవా చూపించింది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది.

ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మలయాళం మూవీగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక మలయాళంతో పాటు తమిళంలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ముదులిపేసింది. ఇక తెలుగులోనూ ఏప్రిల్ 6న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో వారికి ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని ఈ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఈ చిత్రాన్ని మే 5న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని హిందీ, మలయాళం, తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది.

Advertisement

రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించాడు. తమిళనాడులోని కొడైకెనాల్‌కి టూర్‌కి వెళ్లిన కొందరు కేరళ యువకులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ కథ మొత్తం ‘గుణ కేవ్’ చుట్టూ తిరుగుతుంది. ఇక సర్వైవల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్లింగ్‌ను అందించింది. మరి మీరు థియేటర్లలో ఈ మూవీని మిస్ అయితే ఓటీటీలో చూసేయొచ్చు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×