BigTV English

Miss Universe Buenos Aires : అందాలపోటీల్లో చరిత్ర.. మిస్ యూనివర్స్ గా 60 ఏళ్ల భామ

Miss Universe Buenos Aires : అందాలపోటీల్లో చరిత్ర.. మిస్ యూనివర్స్ గా 60 ఏళ్ల భామ

Miss Universe Buenos Aires Alejandra Marisa Rodriguez : అందాల పోటీల్లో 60 ఏళ్ల భామ సరికొత్త చరిత్ర సృష్టించింది. 60 ఏళ్ల బామ్మ కదా.. భామ ఏంటి అనుకుంటున్నారా ? ఆమెను చూస్తే.. మీకు బామ్మ అన్న ఫీలింగ్ ఏమాత్రం కలగదు మరి. ఆరుపదుల వయసులోనూ.. తన అందచందాలతో మతి పోగొడుతోందీ భామ. అందాలపోటీలంటే.. యుక్తవయసు అమ్మాయిలే ఉంటారన్న భావనను ఒక్కదెబ్బతో పోగొట్టేసింది అర్జెంటీనాకు చెందిన అలెగ్జాండ్రా మరీసా రొడ్రిగోజ్(Alegjandra Marisa Rodriguez).


ఇటీవల అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో అలెగ్జాండ్రా కూడా పాల్గొంది. పాల్గొనడమే కాదు.. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్, కిరీటాన్ని సొంతం చేసుకుంది. 60 ఏళ్ల వయసులో అందాలపోటీల్లో కిరీటం పొందిన తొలి మహిళగా అలెగ్జాండ్రా సరికొత్త రికార్డు సృష్టించింది. సంకల్పం గొప్పదైతే.. వయసు దానికి అడ్డుకాదన్న సత్యాన్ని నిరూపించిందామె. అలెగ్జాండ్రా.. వృత్తిరీత్యా లాయర్, జర్నలిస్ట్.

Also Read : యూఎస్‌లో భారత సంతతి విద్యార్థి అరెస్ట్, ఆ పై నిషేధం.. అందుకేనా..?


60 ఏళ్ల వయసులో అందాలపోటీల్లో గెలిచిన అలెగ్జాండ్రా ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. మే నెలలో జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో బ్యూనస్ ఎయిర్స్ తరఫున ప్రాతనిధ్యం వహించేందుకు ఆమె సన్నద్ధమవుతోంది. ఈ పోటీల్లో కూడా గెలిస్తే.. మెక్సికో వేదికగా జరిగే.. Miss Universe 2024 పోటీల్లో అర్జెంటీనా తరఫున పోటీ చేస్తుంది.

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×