BigTV English

DC vs MI Match Preview: ముంబై గట్టెక్కేనా?.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్

DC vs MI Match Preview: ముంబై గట్టెక్కేనా?.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్

Delhi Capitals vs Mumbai Indians Match Preview: ఐపీఎల్ 2024లో సంచలనాలకు వేదికగా నిలిచిన ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ వెళుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.


ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ 4 గెలిచింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇక ముంబై 8 మ్యాచ్ లు ఆడి 3 గెలిచి 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 34 సార్లు మ్యాచ్ లు జరిగాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 15 సార్లు గెలిస్తే, ముంబై 19 సార్లు విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తరచూ వివాదాస్పదం అవుతోంది. తన ఎంపికే పెద్ద తలనొప్పిగా మారితే, తన ఆటతీరు, జట్టుతో కలిసి నడుస్తున్న తీరు, మ్యాచ్ అనంతరం మాట్లాడుతున్న తీరు ఇవన్నీ ముంబైకి కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నాయి. దీంతో జట్టులో సమతుల్యత దెబ్బతింటోంది.


నిజానికి 11 మంది జట్టులో ఒకరు ఆడకపోతే ఒకరు ఆడాలి. ఎవరు ఆడకపోతే కెప్టెన్ అయిన సమయస్ఫూర్తిగా ఆడాలి. ఇవేవీ జరగకపోవడంతో మ్యాచ్ లు గెలవడంలో విఫలమవుతున్నారు. పైపెచ్చు రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ మాట్లాడటం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే రిషబ్ పంత్ మళ్లీ లయ అందుకున్నాడు. పాత చిచ్చరపిడుగు మళ్లీ బయటకు వచ్చాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తనిలాగే ఆడితే ప్రత్యర్థులకు చుక్కలు తప్పవు. మొత్తానికి అందరూ లయ అందుకున్నారు. బండి ఇప్పుడు స్పీడు అందుకుంది. అటు బ్యాటింగు, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటా దూకుడు పెరిగింది.

Also Read: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హిస్టరీ.. పోరాడి ఓడిన కోల్ కతా

డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు క్లిక్ కాలేదు. తను భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. ప్రథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కుకున్నాక, వాటిని భారీ స్కోర్లుగా మార్చలేకపోతున్నారు. ఈ బలహీనతలను అధిగమిస్తారని ఆశిద్దాం. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×