Manchu Vishnu : గత రెండు మూడు రోజుల నుంచి మంచు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకుని నిన్న ‘కన్నప్ప’ షూటింగ్ ను పక్కన పెట్టి హైదరాబాద్ కు చేరుకున్నాడు మంచు విష్ణు. కానీ ఆయన ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. నిన్న రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్, మోహన్ బాబుకు మధ్య వాగ్వాదం నెలకొనడం, మంచు మనోజ్ గేటు పగలగొట్టుకుని ఇంట్లోకి వెళ్లడం, జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి, ఆ తర్వాత మోహన్ బాబు (Mohan Babu) ని ఆస్పత్రిలో చేర్పించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు విష్ణు( Manchu Vishnu) మీడియా ముందుకు వచ్చారు. నిన్న జరిగిన గొడవలో మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడం గురించి స్పందిస్తూ, అందులో ఆయన తప్పు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడారు మంచు విష్ణు. అంతేకాకుండా తాము పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ కొంతమంది జర్నలిస్టులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.. దీంతో విష్ణు సమాధానం పై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే నిజానికి ప్రెస్ మీట్ లో మంచు విష్ణు ఒకే పదాన్ని మళ్లీమళ్లీ వాడుతూ కనిపిస్తున్నారు. మీడియా ఆయనను ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. కానీ మంచు విష్ణు మాత్రం సమాధానాలు ఇవ్వట్లేదు. పైగా ప్రతి దానికి ఐయామ్ నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అంటున్నాడు. దీంతో ఆయన దగ్గర ఎలాంటి సమాధానాలు లేకుండానే మీడియా ముందుకు వచ్చారా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా మనోజ్, మోహన్ బాబు మధ్య జరుగుతున్న గొడవను మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అన్నగా ఫెయిల్ అయ్యారా? అనే ప్రశ్నకి కూడా మంచు విష్ణు సమాధానం ఇవ్వలేదు. మొత్తానికి మంచు విష్ణు (Manchu Vishnu) ఈ గొడవను సద్దుమణిగేలా చేయకుండా అగ్నికి ఆజ్యం పోశారు.
మరోవైపు మంచు మనోజ్(Manchu Manoj) నిన్న జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా ఆయన విచారణకు హాజరయ్యాక, ఈరోజు సాయంత్రం నిజాలను బయట పెడతానంటూ ఛాలెంజ్ విసిరారు. మరోవైపు విష్ణు తన తమ్ముడు మనోజ్ కి సాయంత్రం 5 గంటల వరకు డెడ్లైన్ విధించాడు. దీంతో ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది అనే ఉత్కంఠత నెలకొంది. మరోవైపు మోహన్ బాబు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయగా, ఆయన ఆరోగ్యం స్థిమితంగా లేదని వెల్లడించారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు ‘ఐ యామ్ నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ‘ అంటూ పదే పదే చెప్పడం ట్రోలింగ్ కు దారి తీసింది. గతంలో మంచు ఫ్యామిలీ నుంచి ఫసక్, నిలదీస్ ఫై వంటి పదాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మంచు విష్ణు నోటి నుంచి వచ్చిన ‘ఐ యాం నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ‘ డైలాగ్ నేపథ్యంలో గతంలో వాడిన పదాల వల్ల మంచి ఫ్యామిలీ ట్రోలింగ్ కు గురైన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు.